18న జిల్లాకు సీఎం రామగుండానికి రాక


Fri,May 17, 2019 02:55 AM

- తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు పరిశీలన
- జెన్‌కో అధికారులతో సమీక్ష
- రాత్రి ఎన్టీపీసీలోనే బస
- తిరిగి 19 ఉదయం కాళేశ్వరం దేవస్థానంలో పూజలు
- మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపు హౌస్‌ సందర్శన
- అప్రమత్తమైన అధికారులు
- ఏర్పాట్లలో నిమగ్నం
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 18వ తేదీన హైదరాబాద్‌ నుంచి బయలుదేరి, రామగుండంలోని ఎన్టీపీసీకి సీఎం చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో భాగంగా పూర్తిగా స్వరాష్ట్ర అవసరాల కోసం రామగుండంలో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. అనంతరం జెన్‌కో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి ఎన్టీపీసీలోనే బస చేసి, మరుసటి రోజు ఉదయం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి కన్నెపల్లి పంపుహౌస్‌, మేడిగడ్డ బ్యారేజీ పనులు పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన ఖరారు కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...