మే 21 లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి


Fri,May 17, 2019 02:54 AM

రామగిరి : మే 21వ తేదీ లోగా మంథని జేఎన్‌టీయూలోని కౌంటింగ్‌ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీ దేవసేన ఆదేశించారు. పార్లమెంట్‌ ఎన్నికల కౌంటింగ్‌ కోసం సిద్ధమవుతున్న కేంద్రాన్ని ఆమె గురువారం ఏఆర్‌ఓలతో కలిసి సందర్శించారు. కౌంటింగ్‌ కేంద్రంలో అవసరమైన సాంకేతిక పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను వెల్లడించే రోజులోగా అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసుకోవాలనీ, ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధిత కౌంటింగ్‌ హాల్‌ను ఒకే రీతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కౌంటింగ్‌ హాల్‌లో అవసరమైన మేర అత్యాధునిక సాంకేతికతతో కూడిన కంప్యూటర్లతోపాటు వేగవంతమైన ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, ప్రత్యేకమైన ఐటీ అడ్రస్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా ఏర్పాట్లు చేయాలన్నారు. కంప్యూటర్లకు నెట్‌ కనెక్టివిటీ, ఎనిమిది గంటలకు పైగా పవర్‌ బ్యాక్‌అప్‌ ఉండేలా చూసుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద పాత్రికేయుల కోసం మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయాలనీ, అందులో అవసరమైన అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్‌ కేంద్రం వద్ద అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం కౌంటింగ్‌ హాల్‌ను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. హాలు వద్ద కౌంటింగ్‌ ఏజెంట్లకు టేబుల్‌ మధ్యలో కట్టుదిట్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలనీ, అన్ని కౌంటింగ్‌ హాళ్లలో విధులు నిర్వర్తించేవారికి ఒకే రీతిలో గుర్తింపు కార్డులు అందించాలని సూచించారు. కౌంటింగ్‌ హాల్‌కు ఎంట్రీ, ఎగ్జిట్‌ వేర్వేరుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ వనజాదేవి, జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో నర్సింహామూర్తి, పెద్దపల్లి ఆర్డీవో ఉపేందర్‌ రెడ్డి, మంథని ఆర్డీవో నగేశ్‌, ఎమ్మార్వోలు, అధికారులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...