కాళేశ్వరం జైత్రయాత్ర


Thu,May 16, 2019 02:46 AM

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ధర్మారం: తెలంగాణ వరదాయినీ, జీవధార కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ మోటర్ల నీటి ఎత్తిపోతల పరీక్షలు దిగ్విజయమవుతున్నవి. గోదావరి నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పానికి అనుగుణంగా ఇంజినీరింగ్‌ యంత్రాంగం కృషితో ఒక్కొక్కటిగా సిద్ధమవుతున్నవి. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపులో భాగంగా ఆరో ప్యాకేజీలోని కీలక నందిమేడారం పంప్‌హౌస్‌లో మోటర్లకు వెట్న్‌ సక్సెస్‌ఫుల్‌గా ముందుకునడుస్తున్నది. బుధవారం నిర్వహించిన మూడు, నాలుగు మోటర్లకు నిర్వహించిన (నీటిని ఎత్తిపోసే విధానాన్ని పరీక్షించే ప్రక్రియ) విజయవంతమైంది.

వెట్న్‌ సక్సెస్‌..
నంది మేడారంలో అండర్‌ టన్నెల్‌లో గత నెల 24న మొదటి, 25న రెండో మోటర్‌ విజయవంతంగా నీటిని ఎత్తిపోయగా, బుధవారం మూడు, నాలుగు మోటర్ల వెట్న్‌ సక్సెస్‌ అయింది. ఎత్తిపోతల పథకం సలహాదారు పెంటారెడ్డి, సీఎంఓ ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌ పాండే, ట్రాన్స్‌కో డైరెక్టర్‌ సూర్య ప్రకాశ్‌తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు మూడు, నాలుగు పంపుల వెట్న్‌ మధాహ్నం 12:10 గంటలకు ప్రారంభించారు. ముందుగా హైదరాబాద్‌ నుంచి ఉదయం 11:20 గంటలకు హైదరాబాద్‌ నుంచి సీఎంఓ ఓఎస్డీ దేశ్‌ పాండే నందిమేడారానికి వచ్చి, 11:30 గంటలకు పంప్‌హౌస్‌కు చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, మధ్యాహ్నం 12:10 గంటలకు కంప్యూటర్‌ ద్వారా 127.6 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడో మోటర్‌ వెట్న్‌ ప్రారంభించగా, నిర్ణీత సమయానికే 200 ఆర్‌పీఎం (రివల్యూషన్‌ పర్‌ మినిట్‌)కు చేరుకున్నది. 105మీటర్ల పైన ఉపరితలంలో 3,200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసింది.

నాలుగో మోటర్‌కు డ్రైరన్‌.. ఆవెంటే వెట్న్‌
మూడో మోటర్‌ వెట్న్‌ పూర్తయ్యాక నాలుగో మోటర్‌కు నీటి ఎత్తిపోతల పరీక్ష నిర్వహించారు. ఈ మేరకు ముందుగా డ్రైరన్‌ చేశారు. అనంతరం సాంకేతిక పరీక్షలన్నీ పూర్తి చేసి, అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్దారించుకున్నాక సాయంత్రం 6.40 గంటలకు నాలుగో మోటర్‌ వెట్న్‌ చేశారు. ఈ మోటర్‌ సైతం 3200 క్యూసెక్కుల నీటిని లిప్ట్‌ చేయగా, 105 మీటర్ల పైన భూ ఉపరితలంలోని డెలీవరీ సిస్టర్న్‌ ద్వారా బయటికి వచ్చాయి. నాలుగు మోటర్లు విజయవంతం కావడంతో ప్రాజెక్ట్‌లో కీలక అడుగు వేసినట్లయింది. ఇక్కడ ట్రాన్స్‌కో డైరెక్టర్‌ సూర్య ప్రకాశ్‌, ట్రాన్స్‌కో ఈడీ ప్రభాకర్‌, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ సుధాకర్‌ రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్‌లతోపాటు డీఈఈ గునిగంటి నర్సింగారావు, ఏఈలు బీ ఉపేందర్‌, ఏ నర్సింగారావు, శ్రీనివాస్‌, నవయుగ డైరెక్టర్‌ వెంకట రామారావు, జీఎం శ్రీనివాస్‌రావు, సీనియర్‌ డీపీఎం శ్రీనివాస్‌ బాబు, ధర్మారం ఎంపీడీఓ బాలరాజు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

కీలక మైలురాయి..
వచ్చే వానాకాలంలో గోదావరి నీటిని రాష్ట్రంలోని చెరువులు, కుంటలకు తరలించాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రాజెక్టు శరవేగంగా నిర్మితంకాగా, చివరి అంకాలైన పనులు చకచకా జరుగుతున్నాయి. నీటి తరలింపు మార్గాలన్నీ తెరుచుకుంటున్నాయి. ప్రాజెక్టులో లింక్‌-1లో భాగంగా చేపడుతున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు చేపడుతుండగా, అంతకంటే ముందుగానే వానాకాలంలో ఎల్లంపల్లికి వచ్చే వరదనీటిని వృథాకాకుండా తరలించుకోవాలనే లక్ష్యానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. లింక్‌-2లో భాగంగా ప్యాకేజీ -6లోని నంది మేడారంలోని పంపులను సిద్ధం చేయడంతోపాటు ప్యాకేజీ-7, ప్యాకేజీ-8లోని లక్ష్మీపూర్‌ పంప్‌హౌస్‌లోని మోటర్లను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...