ఓసీపీ-3లో డైరెక్టర్‌ పర్యటన


Thu,May 16, 2019 02:44 AM

యైటింక్లయిన్‌ కాలనీ : ఆర్జీ-2 పరిధిలోని ఓసీపీ-3 ప్రాజెక్టులో డైరెక్టర్‌ (ఆపరేషన్‌ అండ్‌ పా) చంద్రశేఖర్‌ బుధవారం పర్యటించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టుకు చేరుకున్న వ్యూపాయింట్‌ ద్వారా ప్రాజెక్టులోని పని స్థలాలను, యంత్రాల పని తీరును పరిశీలించారు. అనంతరం ఏజెంట్‌ కార్యాలయంలో ప్రాజెక్టు మ్యాప్‌ను పరిశీలించి ఉత్పత్తి, ఉత్పాదకత, యంత్రాల పనితీరు, పని స్థలాల పెంపు, రక్షణ చర్యలపై చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుకు నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను నెలవారీగా సాధించేలా ముం దస్తు చర్యలు తీసుకుని లక్ష్యాలను అధిగమించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఎండతీవ్రత దృష్ట్యా కార్మికులు వడదెబ్బకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్ష సమావేశంలో జీఎం కల్వల నారాయణ, ప్రాజెక్టు అధికారి బండి వెంకటయ్య, సీహెచ్‌పీ ఎస్‌ఈ సదానందం, పీఈ దుర్గాప్రసాద్‌, ఎస్‌ఎస్‌ఓ చంద్రశేఖర్‌, మేనేజర్‌ మాధవరావు, సెక్యూరిటీ అధికారి జానకి రామారావు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...