మొక్కల పెంపకంపైదృష్టి సారించండి


Thu,May 16, 2019 02:44 AM

-ఎంపీడీఓ శివాజీ
రామగుండం రూరల్‌ : ఉమ్మడి రామగుండం మండలంలోని ఉపాదిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులతో బుధవారం ఎంపీడీఓ శివాజీ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఏర్పాటుచేసిన నర్సరీల్లో మొక్కల పెంపకం కేంద్రాలను సంరక్షించాలనీ, ప్రతి గ్రామం నుంచి 40 వేల మొక్కలు హరితహారానికి అందజేయాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూడాలన్నారు. 2019-20 సంవత్సరం హరితహారం మొక్కలు పెట్టేందుకు స్థలాన్ని ఎంపికచేయాలని సూచించారు. ఉపాధి హామి కూలీలకు ఎండవేడి నుంచి ఉపశమనానికి పనిస్థలాల్లో వసతులు కల్పించాలని సూచించారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించి, ప్రతి ఇంటికి ఇంకుడుగుంత, వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండేలా గ్రామస్తులను ప్రోత్సహించాలన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు, స్మశానవాటిక నిర్మాణాలను వెంటనే పూర్తి చేయించాలన్నారు. సమావేశంలో సూపరింటిండెంట్‌ యాదగిరి, ఏపీఓ టి. రమేశ్‌ పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...