పైపులైన్‌లో పడి యువకుడి మృతి


Thu,May 16, 2019 02:43 AM

కలెక్టరేట్‌ : ఉపాధి నిమిత్తం మిషన్‌ భగీరథ పథకం పనుల్లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు పైపులైన్‌లో పడి మృతి చెందిన సంఘటన బుధవారం పెద్దపల్లి మండలం పాలితం గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం, పాలితం గ్రామానికి కొప్పుల శ్రీనివాస్‌-రాజేశ్వరి దంపతుల రెండో కొడుకు కొప్పుల సునీల్‌(22) గ్రామ శివారులోని మిషన్‌ భగీరథలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గ్రామానికి తాగునీరు రావడం లేదనే కారణంతో బుధవారం ఉదయం పైపులైన్‌ వెంట పరిశీలిస్తూ వెళ్తున్న క్రమంలో గ్రామ శివారులోని పైపులైన్‌లో చెత్త తట్టుకున్న విషయాన్ని గమనించిన సునిల్‌, దాన్ని తొలగించేందుకు ఉపక్రమించాడు. చెత్తను తొగించే క్రమంలో సునిల్‌ ప్రమాదవశాత్తు పైపులైన్‌లో ఇరుక్కుపోయాడు. ప్రమాదంలో చిక్కుకున్న సునిల్‌ అరుపులు, కేకలు వేసినా, చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకోలేక మృతి చెందాడు. ఉదయమే ఇంటి నుంచి వెళ్లిన అతడు ఎంతకూ రాకపోవడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు, గ్రామస్తులు గాలించారు. చివరకు గ్రామ శివారులోని పైపులైన్ల వద్ద అతడి చెప్పులు కనిపించడంతో పరిశీలించి చూడగా, అప్పటికే సునిల్‌ మృతి చెందడాన్ని గమనించి తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ వివరించారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...