అందరి సహకారంతో అభివృద్ధికి శ్రీకారం


Thu,May 16, 2019 02:43 AM

-సుల్తానాబాద్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు
-బాధ్యతల స్వీకరణ
సుల్తానాబాద్‌ : సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని వార్డుల వారిగా అందరి సహకారంతో అభివృద్ధికి శ్రీకారం చుడుతానని కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు పేర్కొ న్నారు. సుల్తానాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా ఎనగంటి శ్యాంసుందర్‌రావు బాధ్య తలు బుధవారం స్వీకరించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఆయనకు మున్సిపల్‌ సిబ్బంది పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్యాం సుందర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పట్టణాన్ని, ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానన్నారు. సాని టేషన్‌, స్ట్రీట్‌లైట్స్‌, వాటర్‌ సైప్లెతో పాటు ప్లాస్టిక్‌ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జగిత్యాల మున్సిపల్‌ కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేసిన శ్యాంసుందర్‌రావు ప్రమోషన్‌పై సుల్తానాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా వచ్చి బాధ్యతలు స్వీకరించారు. స్వాగతం పలికిన వారిలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి శ్రీధర్‌, సిబ్బంది ఎన్నం అంజయ్య, విజయ్‌, రజని, మున్సిపల్‌ సిబ్బంది తదితరులున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...