విధులు సమర్థంగా నిర్వర్తించాలి


Thu,May 16, 2019 02:43 AM

జూలపల్లి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ప్రతి ఒక్కరూ సమర్ధవంతంగా నిర్వహించి లక్ష్యం చేరుకోవాలని ఈజీఎస్‌ పెద్దపల్లి ఏపీడీ శ్రీనివాస్‌ సూచించారు. ఈజీఎస్‌ పనుల నిర్వహణ తీరుపై జూలపల్లిలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదో విడత హరితహారం విజయవంతం అయ్యేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. గ్రామానికో నర్సరీలో 85 శాతం ఎదుగు తున్న మొక్కలను కాపాడుకోవాలని ఆదేశించారు. రోడ్లకిరువైపులా, సామాజిక ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు కూలీలతో గుంతలు తవ్వించి సిద్ధంగా ఉంచాల న్నారు. ఇంటికో మరుగుదొడ్డి, ఇంకుడుగుంత, పశువుల తొట్టెలు తప్పకుండా నిర్మించుకునేటట్లు ప్రజల్ని చైతన్యవంతం చేయాలని వివరించారు. ఇక్కడ ఏపీఓ సదానందం, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...