వరిగడ్డికి కొరత


Thu,May 16, 2019 02:43 AM

ఓదెల: ప్రస్తుత రబీ వ్యవసాయ సీజన్‌లో ఆశించిన మేర వరి సాగుకాకపోవడంతో పశువుల మేతకు కరువు వచ్చింది. పాడి పశువులతో పాటు వ్యవసాయానికి అవసరమైన పశువుల మేత కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఓదెల మండలంలో 11,604 హెక్టార్ల వ్య వసాయ భూమికి గాను 5,612 హెక్టార్లలో వరి సాగు అయింది. సగాని కంటే తక్కువగా వరి వేయడంతో ఇతర ప్రాంతాల నుంచి రైతులు పశుగ్రాసాన్ని ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో కొనుక్కోని వస్తున్నారు. కోసిన పొలం లో పొల్లు గడ్డి కూడా పోకుండా మహిళలు ఏరుకోని కట్టలు కట్టుకుని మోపులతో మోసుకోచ్చుకుంటున్నారు. గడ్డి కరువు ఈ సారి తీవ్రం గా ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఎకరం పొలంలోని గడ్డికి నాలుగు వేల పైబడి అమ్మకం ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ట్రాక్టర్లలో ఇతర గ్రామాల నుంచి గడ్డిని తెచ్చుకుంటే ట్రాక్లర్‌ కిరాయి, గడ్డిని ట్రాక్టరల్లో వేసేందుకు కూలీల అవసరంతో దాదాపు మరో 2800 ఖర్చు వస్తున్నట్లు తెల్పుతున్నారు. గతేడాది ఆశించిన వానలు కురవక పోవడంతో రబీలో నీటి కొరత ఉంటదని భావించిన రైతులు పొలాలను తక్కువ శాతం సాగు చేశారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి కాళేశ్వర్‌ ప్రాజెక్ట్‌ ద్వారా ప్రభుత్వం సాగు నీరందించనున్నడంతో విరివిగా వరి సాగు జరిగి పశువుల మేతకు గడ్డి బాధలు తప్పుతాయని రైతులు ఆశిస్తున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...