అందుబాటులో సీఎం పీఎఫ్‌ వివరాలు


Wed,May 15, 2019 02:57 AM

యైటింక్లయిన్‌ కాలనీ : సింగరేణి ఉద్యోగులకు మరింత అందుబాటులో సీఎంపీఎఫ్‌ వివరాలు ఉంచేలా కొత్త టెక్నాలజీతో ముందుకు సాగుతున్నామని సీఎంపీఎఫ్‌ అసిస్టెంట్‌ కమీషనర్‌ కనుకమ్మ వెల్లడించారు. ఆర్జీ-2 జీఎం కల్వల నారాయణ, గుర్తింపు సంఘం డివిజన్‌ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌తోపాటు ఇతర ఉన్నత అధికారులతో మంగళవారం జరిగిన త్రైపాక్షిక సమావేశంలో ఆమె పాల్గొని సీఎంపీఎఫ్‌ విధానాలపై వివరించారు. సింగరేణిలో శాప్‌ అనే సాఫ్ట్‌వేర్‌కు సీఎంపీఎఫ్‌ వారు తమకు సంబంధించిన ఓఎస్‌ఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేసేందుకు సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఐటీ నిపుణుల సహయం కోరినట్లు తెలిపారు. దీంతో సీఎంపీఎఫ్‌ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో త్వరితగతిన తెలుసుకోవచ్చని చెప్పారు. ఉద్యోగులు విరమణ పొందిన తర్వాత బ్యాంకు ఖాతా నెంబరును మార్చుకోవడంతోపాటు నామీనిగా భార్య పేరును నమోదు చేసుకుంటే తరువాత కాలంలో ఒకవేళ ఉద్యోగి మరణిస్తే అతని పింఛన్‌ భార్యకు త్వరగా లభించే అవకాశముంటుందని గుర్తు చేశారు. భవిష్యత్తులో కార్మికులు లేదా కాంట్రాక్ట్‌ కార్మికులు ఉద్యోగంలో చేరిన వెంటనే తమ నామీని పత్రాలను ఆన్‌లైన్‌లో సీఎంపీఎఫ్‌ ఆఫీసుకు పంపెలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతేకాకుండా, ఉద్యోగుల సౌకర్యార్థం సీఎం పీఎఫ్‌ వివరాలను తెలుసుకోవడం ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యేకంగా వాటప్స్‌ నెంబరును, మెయిల్‌ఐడి ఏర్పాటు చేశామన్నారు. దీంతో దగ్గరంలోని మీ సేవ కేంద్రల్లో తమ వివరాలను తెలుసుకోవచ్చునని తెలిపారు. సమావేశంలో ఎస్‌ఓటూ జీఎం సాంబయ్య, అధికారుల సంఘం అధ్యక్షుడు ఎంవీ నర్సింహరావు, డీజీఎం(ప) ఎన్‌వీ రావు, సివిల్‌ డీజీఎం రామకృష్ణ, ఫైనాన్స్‌ అధికారి పద్మారావు, సీఎంపీఎఫ్‌ అధికారులు ఎండీ నఫీజ్‌ అలం, జీఎస్‌ ప్రకాష్‌రావు, సీహెచ్‌ వెంకటరమణ పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...