ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు


Wed,May 15, 2019 02:57 AM

-ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌
-కేకే నగర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి అభినందన
యైటింక్లయిన్‌ కాలనీ : టీఆర్‌ఎస్‌ పభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ప్రబుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగై, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 39వ డివిజన్‌ కేకే నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివిన గుగులోల్‌ అఖిల 9.7జీపీఏ సాధించడం అభినందనీయమన్నారు. ఆమెకు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ప్రభుత్వ పాఠశాల్లో చదవుతున్నావారేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఐదేళ్లలో రాష్ట్రముఖ్యమంతి కేసీఆర్‌ ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠపర్చి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన అందించేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంతోపాటు రెసిడెన్సియల్‌ విద్యావిధానంలో భాగంగా మండల కేంద్రాల్లో గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట దుర్గం రాజేశం, కుమార్‌ నాయక్‌, సారయ్యనాయక్‌, రమేశ్‌ నాయక్‌, శంకర్‌నాయక్‌, రాజేశ్‌ తదితరులు ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...