విశ్వభారతి విద్యార్థులను అభినందించిన మంత్రి


Wed,May 15, 2019 02:56 AM

జ్యోతినగర్‌ : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఎన్టీపీసీలోని విశ్వభారతి పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జి.శాలిని, అస్మ, బీ అజయ్‌, ఈ.హర్షిత 10జీపీఏ సాధించడంపై తెలంగాణ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మంగళవారం విద్యార్థులను అభినందించారు. పుష్పాగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గతేడాదికంటే పదిలో పాఠశాల ఫలితాలు రెట్టింపుగా మెరుగైన ఫలితాలకు కృషి చేసిన పాఠశాల యాజమాన్యాన్ని కూడా మంత్రి అభినందించారు. అలాగే, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఫలితాలపై హర్షం వ్యక్తం చేసి, అభినందించారు. ఇక్కడ విశ్వభారతి పాఠశాల చైర్మన్‌ బంధారపు యాదగిరి గౌడ్‌, ప్రధానోపాధ్యాయుడు తిరుపతి గౌడ్‌, అధ్యాపకులు శ్రీనివాస్‌, జగన్‌, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...