పేదలను ఆదుకోవడమే లక్ష్యం


Sun,May 12, 2019 02:17 AM

సుల్తానాబాద్ : పేదలను ఆదుకోవడమే ఎగోలపు ట్రస్టు లక్ష్యమని ఆ ట్రస్ట్ అధ్యక్షుడు ఎగోలపు సదయ్యగౌడ్ చెప్పారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో ఇంటి పెద్దను కోల్పోయి పేదరికంలో ఉన్న కుక్క రాజారం కుటుంబానికి ట్రస్ట్ తరఫున శనివారం ఆర్థికసాయం అం దించారు. ఈ సందర్భంగా సదయ్య గౌడ్ మాట్లాడుతూ, ఇంటికి పెద్ద దిక్కయిన కుక్క రాజారం అనారోగ్యంతో మరణించడంతో తన వంతు సహాయంగా వారి కుటుంబానికి 25 కిలోల బియ్యంతో పాటు నెలకు సరిపడా నిత్యావసరాలు అందించానని వివరించారు. నాలుగేళ్లుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ సభ్యులు తిప్పారపు కమల దయాకర్, మార్క రాకేశ్‌గౌడ్, గోకూరి కిరణ్‌రెడ్డి, ముక్కు బాబుగౌడ్, న్యాతరి ప్రకాశ్, అల్లెపు చంద్రశేఖర్, మైలారం శ్రీనివాస్, దెశెట్టి వంశీకుమార్, ఆసంపల్లి కనుకయ్య, కుక్క లక్ష్మి, సరోజ, మోతె లలిత తదితరులున్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...