జిల్లావ్యాప్తంగా మట్టి నమునాల సేకరణ


Sun,May 12, 2019 02:17 AM

జూలపల్లి : రైతు శ్రేయస్సు కోసం జిల్లా వ్యాప్తం గా పొలాల్లో మట్టి సేకరిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమలప్రసాద్ స్పష్టం చేశారు. మండలంలోని అబ్బాపూర్‌లో శనివారం రైతుల పొలాల్లో భూసార పరీక్షల కోసం మట్టి నమూనాలు సేకరించారు. ఇక్కడ కమతంలో 6-9 ఇంచుల సైజులో వీ ఆకారంలో మట్టి తీసి వృత్తాకారంలో పరిచి, నాలుగు భాగాలు చేసి ఎదురెదురుగా భాగాలు తీసి వేస్తూ 500 గ్రాముల మట్టి సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని మట్టి నమూనాలకు ఎంపిక చేస్తున్నామని పేర్కొన్నారు. గుర్తించిన గ్రామంలో ప్రతి రైతు కమతంలో మట్టి నమూనాలు తీసుకుంటామని తెలిపారు. భూసా ర పరీక్షల ద్వారా నేల స్వభావం తెలుస్తుందని పేర్కొన్నారు. నేలలో నత్రజని, భాస్వరం, పొటాష్, ఇతర సూ క్ష్మాధారిత పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుం దని పేర్కొన్నారు.

దీనికి అనుగుణంగా ఏ పంటలు సేద్యం చేసుకోవాలో, ఎరువులు ఎంత వా డాలో సూచనలు. సలహాలు ఇ చ్చి రైతులు నష్టపోకుండా చర్య లు తీసుకుంటామని వివరించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభ దశలోనే సేకరించిన మట్టి నమూనాల వివరాలు అందిస్తామని తెలిపారు. జనుము, జీలుగ, వరి విత్తనాలు రాయితీపై అందజేస్తున్నామని పేర్కొన్నారు. రైతులు ఎప్పటికప్పుడూ పంటల సమగ్ర సస్యరక్షణ చర్యల కోసం వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. రాయితీ విత్తనాలు ప్రతి రైతు పొంది సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. ఇక్కడ సర్పంచ్ వీర్ల మల్లేశం, ఏఈఓలు సతీశ్, సాయిప్రసన్న, రమేశ్ తదితరులున్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...