స్కూల్‌కు అనుమతి రద్దు చేయాలి


Sun,May 12, 2019 02:16 AM

ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్‌షిప్‌లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌కు ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కలెక్టర్ శ్రీ దేవసేనను కలిసి విన్నవించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో రామగుండం ఎరువుల కర్మాగారం టౌన్‌షిప్‌లో కేంద్రీయ, డీఏవీ పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉండేవనీ, అయితే ఎఫ్‌సీఐ మూసివేత తర్వాత అవి మూతపడ్డాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటాతో రామగుండం ఎరువుల కర్మాగారం మళ్లీ పునరుద్ధరణకు నోచుకుంటుందన్నారు.

గతంలో మాదిరిగా కేవీ ఏర్పాటు అవసరం ఉన్నా ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కార్పొరేట్ విద్యా సంస్థలు ధనార్జనే ధ్యేయంగా పుట్టుకొస్తున్నాయనీ, వాటిని అడ్డుకుంటామని చెప్పారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఇక్కడ ఎంతో అవసరమనీ, అలా గాకుండా ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికార యంత్రాం గం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ప్రైవేటు విద్యా సంస్థకుఅనుమతి ఇవ్వడాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. చైతన్య టెక్నో స్కూల్ ఇక్కడ వద్దని స్థానిక ప్రజలంతా విన్నవిస్తున్నారనీ, వారి అభీష్టం మేరకు కట్టుబడి ఉన్నామని వివరించారు. ప్రైవేటు విద్యా సంస్థకు అనుమతి ఇవ్వడం మూలంగా సదరు విద్యా సంస్థ అధికంగా ఫీజులు వసూలు చేసే ప్రమాదముందనీ, తద్వారా ఉద్యోగులకు విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసి చైతన్య టెక్నో స్కూల్‌కు ఇచ్చే అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...