స్థానిక సంస్థలకు పటిష్ఠ బందోబస్తు


Sat,May 11, 2019 01:30 AM

కాల్వశ్రీరాంపూర్ : పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల రెండోదఫా ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. కాల్వశ్రీరాంపూర్, పెగడపల్లి పోలింగ్ కేంద్రాలను శుక్రవారం తన సిబ్బంది తో కలిసి పరిశీలించారు. పోలింగ్ సరళిని పరిశీలించడంతో పాటు, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భగా సీపీ సత్యనారాయణ మాట్లాడారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చెన్నూర్ అసెంబ్లీ పరిధిలో 5 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయనీ, అక్కడ ఎన్నికలు సజావుగా జరిగేందుకు స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేటితో పెద్దపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసాయన్నారు. కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడిషనల్ డీఎస్సీ స్థాయి అధికారిని నియమించామనీ, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్ ఈ మండలాల్లో ఎన్నికల సరళి పర్యవేక్షించారన్నారు. బ్యాలెట్ బాక్స్‌లు స్ట్రాంగ్ రూంకు వెళ్లే వరకు పూర్తి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట పోలీస్ అధికారులు అశోక్‌కుమార్, సంజీవ్, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, ఏసీపీ వెంకట్రామిరెడ్డి, సుల్తానాబాద్ సీఐ గట్ల మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ షేక్ మస్తాన్, ట్రైనీ ఎస్‌ఐ మానస ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...