పది తర్వాత ఇంటర్ చదివించాలి


Sat,May 11, 2019 01:30 AM

ధర్మారం: విద్యార్థినులను పదో తరగతి తర్వాత ఇంటి వద్ద వృథాగా ఉంచకుండా వారిని ఇంటర్ చదివించాలని కస్తూర్బాగాంధీ విద్యాలయం ప్రత్యేక అధికారి విజయ లక్ష్మి పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. ఆ విద్యాలయంలో చదివి పదో తరగతి పరీక్షలు రాసిన బాలికల తల్లిదండ్రులతో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిం చారు. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ, త్వరలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకానున్నాయనీ, ఫలితాల అనంతరం వారికి వచ్చిన మార్కులను తమ పిల్లలను ఇతరులతో పోల్చి ఇబ్బంది పెట్టవద్దని పేర్కొన్నారు. ర్యాంకులు, మార్కులు ప్రాతిపదికతతో విద్యార్థులను తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకూడదన్నారు. తక్కువ మార్కులు వచ్చిన వారు భవిష్యత్‌లో ఉన్నత చదువులు అభ్యసించి ఎక్కువ మార్కులు సాధించి ఎదిగిన వారు ఎందరో ఉన్నారని ఉదహరించారు. పొరపాటున పది లో తప్పితే వారిని ఇంటి వద్ద వృథాగా ఉంచ వద్దని వారికి అడ్వాన్స్‌డ్ సప్టిమెం టరీ పరీక్షలు రాయించి వారిని ఉన్నత చదువులు అభ్యసించేందుకు ప్రోత్సాహాన్ని అందించాలని ఆమె సూచించారు. అలాగే పదోతరగతి ఉత్తీర్ణులైన అనంతరం తమ పిల్లలకు అనుగుణమైన ఇంటర్ కోర్సుల్లో చేర్పించాలని పేర్కొన్నారు. పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చి తల్లిదండ్రులు పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...