కడుపునొప్పి బాధతో వివాహిత ఆత్మహత్య


Sat,May 11, 2019 01:30 AM

ధర్మారం : ధర్మారం మండలం కొత్తపల్లిలో శుక్రవారం మారినేని రజిత (30) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ ప్రేమ్ కుమార్ వివరాల ప్రకారం.. కొత్తపల్లికి చెందిన శ్రీనివాస్‌తో రజితకు 11 ఏళ్ల కిత్రం వివాహమైంది. వారికి ఇద్దరు కొడుకులు సాయి(10), సిద్దూ (7). రజిత భర్త శ్రీనివాస్ గ్రామంలో ఇటుక బట్టీలలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రజితకు కొన్నేళ్లుగా కడుపు నొప్పి ఉంది. చికిత్స చేయించుకున్నా తగ్గడంలేదు. గురువారం తన ఇద్దరు కొడుకులను తీసుకొని కరీంనగర్‌కు వెళ్లి దవఖానలో పరీక్షలు చేయించుకుని అక్కడే ఉపాధి కోసం ఉంటున్న తల్లిదండ్రుల వద్ద రాత్రి ఉంది. శుక్రవారం కొత్తపల్లికి పిల్లలతో వచ్చి రేషన్ బియ్యం తీసుకువచ్చింది. మధ్యాహ్న సమయంలో ఆడుకునేందుకు వెళ్లగా, తాను చికిత్స చేయించుకున్న కడుపు నొప్పి తగ్గడం లేదని జీవితంపై విరక్తి చెంది పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. ఎంతకూ తల్లి లేవకపోవడంతో కొడుకులు రోదించటంతో చుట్టు పక్కల వారు చేరుకొని చూసే సరికి మృతిచెందింది. దీంతో ఆమె పిల్లలు, భర్త రోదించిన తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. రజిత తల్లి గౌరవ్వ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...