విద్యుదాఘాతంతో అగ్ని్ర పమాదం


Sat,May 11, 2019 01:30 AM

ధర్మారం : ధర్మారం మండలం కొత్తపల్లి శివారులో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో కోసిన పొలాల్లోని గడ్డి దగ్ధం కాగా, పలు ఆవులు పాక్షికంగా గాయ పడ్డాయి. ఈ ఘటనలో సుమారు లక్షా 50 వేలు ఆస్తినష్టం జరిగిందని బాధి తులు చెప్పారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామ శివారులో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ లో విద్యుదాఘాతం సంభవించి నిప్పురవ్వలు లేచి సమీపాన ఉన్న వరి గడ్డిపై పడి మంటల చెలరేగాయి. దీంతో ఆ ట్రాన్స్ ఫార్మర్ సమీపాన ఉన్న పొలాల్లో గడ్డికి మంటలు అంటుకొని రాజుకుంది. ఈ క్రమంలో పక్క పక్కనే కలిసి ఉన్న అజ్మీరా రాజేశం నాయక్, అజ్మీరా శంకర్ నాయక్, అజ్మీరా ఆల్య నాయక్, అజ్మీరా రాజు నాయక్, అజ్మీరా దేల్యా నాయక్, అజ్మీరా గేమ్య నాయక్, అజ్మీరా జగ్మల్ నాయక్ అనే రైతుల చెందిన వ్యవసాయ భూములు ఉండగా కోసిన వరి పొలాలలోని గడ్డి దహనమైంది. అగ్ని ప్రమాదం రాత్రి జరగడం వలన మంటలు గ్రామస్తులు ఆర్చేంద దుకు వీలు లేకుండా పోయింది. తెల్లవారే దాకా గడ్డి కాలుతూనే ఉంది.

ఈ అగ్ని ప్రమాదంలో పొలాల్లోని నీటి పైపులు, విద్యుత్తు సర్వీస్ వైర్లు అగ్నికి ఆహుతి అయినాయి. గుడిసెల్లో కట్టి వేసి ఉన్న ఆవుల దాకా మంటలు వ్యాపించడంతో వాటికి కట్టిన తాళ్లు తెంచుకోవడంతో అవి ప్రాణాలతో బయట పడ్డాయి. ఈ ప్రమాదంలో రైతు అజ్మీరా రాజేశం నాయక్ చెందిన ఆవు తీవ్రంగా గాయపడి 40 శాతం గాయాలయ్యాయి. మరో ఇద్దరు రైతులు అజ్మీరా శంకర్ నాయక్‌కు చెందిన రెండు ఆవులు, అజ్మీరా ఆల్య నాయక్‌కు చెందిన రెండు ఆవులు పాక్షికంగా గాయ పడ్డాయి. రైతులు ఇచ్చిన సమాచారంతో శుక్రవారం వీఆర్‌ఓ ప్రణీత్ సంఘటన స్థలానికి వెళ్లి అగ్ని ప్రమాద వివరాలు సేకరించారు. ఈ ఘటనలో సుమారు లక్షా 50 వేల విలువైన నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు వీఆర్‌ఓ చెప్పారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...