భూసార పరీక్షలకు ఎంపిక


Sat,May 11, 2019 01:29 AM

ధర్మారం : భూసార పరీక్షలు నిర్వహించేందుకు వ్యవసాయ అధికారులు ధర్మారం మండలం చామనపల్లిని పైలట్ గ్రామంగా ఎంపిక చేశారు. భూసార సంరక్షణ పథకం పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ గ్రామాన్ని ఆ శాఖ అధికారులు ఎంపిక చేశారు. గ్రామంలో పంటలు సాగు చేసే రైతులఅందరికీ సంబంధించిన భూముల నుంచి మట్టి సేకరణ చేసి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో శుక్రవారం మండల వ్యవసా య అధికారి ఉమాపతి ఆధ్వర్యంలో ఏఈఓలు పలువురు రైతుల వ్యవసాయ భూముల నుంచి మట్టి నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా ఏఓ మా ట్లాడుతూ మట్టి పరీక్షలతో భూసార పరిస్థితులు, సూక్ష్మదాతు లోపాలు తెలుస్తాయని వివరించారు. ఆ మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల యాజమాన్యం పద్ధతులను పాటించడంతో పంటలో అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పైలట్‌గా ఈ గ్రామం లో భూసార పరీక్షలు నిర్వహిస్తున్నందున అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఏఓ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈఓలు ప్రవీణ్, ఆశోద రాంచంద్రం, సతీశ్, మౌనిక, అజిత్, సర్పంచ్ దాసరి తిరుపతి, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ వేల్పుల నాగరాజు, ఏఎంసీ డైరెక్టర్ గంగాధర గంగయ్య, మాజీ సర్పంచ్ పాలమాకుల ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...