ఎన్నికల నిబంధనలు పాటించాలి


Fri,May 10, 2019 03:38 AM

-డీసీపీ సుదర్శన్‌గౌడ్, ఏసీపీ వెంకట్రామిరెడ్డి
-ఎన్నికల సిబ్బందికి సలహాలు, సూచనలు
కాల్వశ్రీరాంపూర్: ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, ఏపీసీ వెంకట్రామిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్న సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో జడ్పీటీసీ, 12ఎంపీటీసీ స్థానాలకు గాను 64 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశామని, ఈ ఎన్నికల్లో 31366 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు ఎంపీడీఓ కిషన్ తెలిపారు. కాగా ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని, ప్రిసైడింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఇక్కడ డీఏఓ తిరుమల్‌ప్రసాద్, తహసీల్దార్ డిండిగాల రవీందర్, సుల్తానాబాద్ సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ షేక్‌మస్తాన్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
ఓదెల: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో పోలీసుల పాత్ర కీలకమని పెద్దపల్లి డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్ పేర్కొన్నారు. రెండో విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓదెల మండల కేంద్రంలో పోలింగ్ విధులు నిర్వర్తించే పోలీసులకు ఆయన శిక్షణ ఇచ్చారు. ఇందులో డీసీపీ సుదర్శన్‌గౌడ్ మాట్లాడుతూ, ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా, ప్రశాంత వాతావరణంలో వేసే విధంగా పోలీసులు చూడాల్సి ఉంటుందనీ, ఆ విధులు నిస్పక్ష పాతంగా ఉండాలన్నారు. ఎండల తీవ్రత చాలా తీవ్రంగా ఉన్నందునా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన మూడు దఫాల ఎన్నికల్లో పోలీసుల పాత్ర ప్రశంసనీయంగా ఉందనీ, ఈ ఎన్నికల్లో కూడా అలాంటి పేరు తేవడానికి ప్రతి పోలీసు పని చేయాలని ఉద్భోదించారు. ప్రజలు కూడా తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటరణారెడ్డి, సుల్తానాబాద్ సీఐ గట్ల మహేందర్‌రెడ్డి, పొత్కపల్లి ఎస్‌ఐ పెట్టెం చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...