ఇవేం ఎండలు..!


Fri,May 10, 2019 03:37 AM

మంథని, నమస్తే తెలంగాణ: భానుడు ఉగ్రరూపం దా ల్చుతున్నాడు. ఉదయం తొమ్మిదయ్యిందంటే చాలు ఎండవేడిమి మొదలవుతున్నది. నిన్న మొన్నటి వర కు 40డిగ్రీల సెంటిగ్రేడ్లుగా నమోదైన ఎండవేడిమి గత రెండు రోజులుగా 45డిగ్రీలకు పైగానే నమోదవుతున్నది. గురువారం ఇది కాస్తా 47డిగ్రీలకు చేరిం ది. ఎండ తీవ్రతతో మంథని డివిజన్‌లోని ప్రజలు పగలు భగ భగ, రాత్రి కుతకుతతో సతమతమవుతున్నారు. రాష్ట్రంలోనే మంథనిలో అత్యధిక ఉష్ణోగ్రత లు నమోదవుతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పగటి పూట ఇండ్లల్లో నుంచి బ యటికి రావాలంటేనే ప్రజలు భయంతో జంకుతున్నారు. ద్విచక్ర వాహనాల్లోని పెట్రోల్ ఎండ వేడిమికి ఆవిరైపోతున్నది. మే నెలలో మండుటెండలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో పగటి పూట జిల్లాలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మంథని, రామగుం డం, పారిశ్రామిక ప్రాంతాలైన గోదావరిఖని, యైటిైంక్లెన్‌కాలనీ, సెంటినరీకాలనీ ప్రాంతాల్లో ఎండ తీవ్రత కారణంగా రోడ్లపై ప్రజలు కనిపించడం లేదు. పట్ట ణ, మండల కేంద్రాల్లోని వ్యాపార కేంద్రాలు సైతం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు లేక వెళవెళబోతున్నాయి. మంథని, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రభావం మరింతగా పెరిగి పోవడం తో పారిశ్రామిక ప్రాంత వాసులు ఎండకు సతమతమవుతున్నారు. వాతావరణంలో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో పెరగడానికి వాతావరణ కాలుష్య మే కారణమని అధికారులు పేర్కొంటున్నారు.

అభివృద్ధి కోసమే చేరికలు
కలెక్టరేట్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోస మే వివిధ పార్టీలకు చెందిన వారంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మ నోహర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయం త్రం జూలపల్లి మండలం వడ్కాపూర్‌కు చెందిన బీజేపీ మండలాధ్యక్షుడు ఎర్రోళ్ల రాములు, బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి ఆసంపల్లి లక్ష్మయ్యలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే దాసరి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గమనిస్తున్న వారంతా ప్రభుత్వానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో పార్టీలకతీతంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మాం కాళి తిరుపతి, బంటు ఎల్లయ్య, రవి, గంట రమే శ్, జడల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...