కౌంటింగ్ సమర్థవంతంగా నిర్వహించాలి


Fri,May 10, 2019 03:36 AM

కలెక్టరేట్: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్ అన్నారు. గురువారం రజత్‌కుమార్ అధ్యక్షతన హైదరాబాద్‌లో కౌంటింగ్ నిర్వహణ, సంబంధించిన ఏర్పాట్లు, తీసుకోవల్సిన చర్యలు, జాగ్రత్తలు వంటి అంశాలపై ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా జరుగుతున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి మొదటిదశలో రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయని, తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 23న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించామని, కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలను చేపట్టాలన్నారు. కలెక్టర్ శ్రీదేవసేన మాట్లాడుతూ, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో గల అన్నిజిల్లాల ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుని కౌంటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తామని ముఖ్య ఎన్నికల అధికారికి తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...