జోరుగా గులాబీ శ్రేణుల ప్రచారం


Thu,May 9, 2019 01:59 AM

సుల్తానాబాద్‌రూరల్/కలెక్టరేట్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం గ్రామాల్లో జోరుగా నిర్వహించారు. బుధవారంతో ఎన్నికల ప్రచారం ముగింపు కావడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు వారి వారి నాయకులతో గ్రామాల్లో పర్యటించి, ఇంటింటా తిరుగుతూ ఓటు వేయాలని ప్రచారం చేశారు. తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సుద్దాలలో టీఆర్‌ఎస్ పార్టీ జడ్పీటీసీ పాల సునీత-రామారావు, ఎంపీటీసీ నౌండ్ల నిర్మల-ఓదెలు అభ్యర్థులకు మద్దతుగా ఎంపీపీ పారుపెల్లి రాజేశ్వరి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గర్రెపల్లిలో పడాల శ్రీజ-అజయ్‌గౌడ్, చిన్నకల్వలలో గుర్రాం సంపత్ గౌడ్, నారాయణపూర్‌లో వేణుగోపాల్‌రావు, రేగడిమద్దికుంటలో అన్నెడి శారద-మహీపాల్‌రెడ్డిలతో పాటు టీఆర్‌ఎస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి పాల సునీత-రామారావు పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. అలాగే పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట, గొల్లపల్లిలో ఎంపీటీసీ టీఆర్‌ఎస్ అభ్యర్థి గోగు రాజయ్యయాదవ్ ఇంటింటా తిరుగుతూ బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారం చివరి రోజు కావడంతో ఎంపీటీసీ పరిధిలో గ్రామాల వీధుల గుండా మద్దతుదారులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ నెల 10న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు నమ్మి మోసపోకుండా టీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీటీసీగా గెలిపించాలని రాజయ్య యాదవ్ కోరారు. ప్రచారంలో సర్పంచ్ తంగెళ్ల జయప్రద, నాయకులు సంజీవరెడ్డి, దాడి కనుకయ్య యాదవ్, హబీబ్ ఉర్ రెహమాన్, చాంద్ పాషా, ఆవుల లక్ష్మణ్, ఈదునూరి వెంకటి, బుర్ర శంకర్‌గౌడ్, వెలిచాల తిరుపతిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, దాడి రాజయ్య యాదవ్, ముత్యాల చంద్రయ్య, ఈదునూరి ప్రేమ్‌కుమార్, కలవేని అయిలయ్య, రాచకొండ శ్రీనివాస్, ముక్కెర లక్ష్మయ్య, ఈదునూరి నర్సింగం, కొండా లక్ష్మణ్, కొండా రాజయ్య, బోయిన పోచాలు, కత్తెర్ల పెద్ద రాజయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...