పురాతన ఆలయాలకు మహర్దశ


Thu,May 9, 2019 01:59 AM

జూలపల్లి : సీమాంధ్ర పాలనలో నిరాదరణకు గురైన ఆలయాలకు తెలంగాణ ప్రభుత్వం మహర్దశ కల్పిస్తున్నది. ఆలయాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ పెద్దయెత్తున నిధులు మంజూరు చేస్తుంది. ఏండ్ల తరబడి గా అప్పటి పాలకుల నిర్లక్ష్యానికి పలు ఆలయాలు జీర్ణ దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో జూలపల్లి మండలం పెద్దాపూర్‌లోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాల పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం రూ. 45 లక్షల నిధులు మంజూరు చేసింది. ఇందులో ఆ గ్రామానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు లెక్కల రాంరెడ్డి, లెక్కల రాజభాస్కర్‌రెడ్డి అన్నదమ్ములు కలిసి 25 శాతం వాటా ధనంగా విరాళం అందజేశారు. వేల ఏళ్ల కిత్రం నిర్మించిన ఆలయాల పుననిర్మాణాలపై గత ఆంధ్ర పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం మరమ్మతు కోసం స్పందించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో రెండు ఆలయాల పునరుద్ధరణ పనులు చేపట్టి, ఆలయాల ఎదుట భాగంలో కొత్త ధ్వజ స్తంబాలు ఏర్పా టు చేయాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహస్వామి గర్భగుడి పనులు కొనసాగుతున్నాయి. పెద్దాపూర్‌లోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం పునరుద్ధరణ పనులు మొదలు కాలేదు. ఆలయ పునరుద్ధరణ పనులపై భక్తుల నుంచి హర్షం వ్యక్తమవుతుంది.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...