పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి


Wed,April 24, 2019 02:43 AM

-కౌంటింగ్, స్ట్రాంగ్ రూంల వద్ద వసతులు కల్పించాలి
-కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టాలి
-కలెక్టర్ శ్రీదేవసేన
-పెద్దపల్లి, గోదావరిఖనిలో లెక్కింపు కేంద్రాల పరిశీలన
కలెక్టరేట్/ఫెర్టిలైజర్‌సిటీ: జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న మొదటి, రెండో విడత ఎన్నికల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తున్న కళాశాలలను మంగళవారం జేసీ వనజాదేవితో కలిసి కలెక్టర్ శ్రీదేవసేన పరిశీలించారు. గోదావరిఖనిలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల, పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్‌లోని మదర్‌థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లాలో రెండు దశల్లో 13 మండలాలకు సంబంధించిన 138 ఎంపీటీసీ, 13 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయనీ, వీటి ఫలితాలను మే 27న వెల్లడించాల్సి ఉన్నందున, అందుకోసం కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో జిల్లాలోని ధర్మా రం, అంతర్గాం, పాలకుర్తి, మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాలకు ఎన్నికలు జరుగుతున్నాయని, వీటికి సంబంధించిన బ్యాలె ట్ బాక్స్‌లను గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలోని మొదటి అంతస్తులో స్ట్రాంగ్ రూమ్‌లను సిద్ధం చేసుకోవాలన్నారు.

రెండో దశలో సు ల్తానాబాద్, పెద్దపల్లి, ఎలిగేడు, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాలకు ఎన్నికలు జరుగనున్నాయని, వీటికి సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌లను పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్‌లో గల మదర్‌థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపర్చే విధంగా స్ట్రాంగ్ రూమ్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన బం దోబస్తు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ కేం ద్రాల వద్ద తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రతి మూడు పోలింగ్ కేంద్రాలను కలిపి ఒక కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మండలాల వారీగా కౌంటింగ్ ప్రక్రియ కోసం హాళ్లలో అవసరమైన టేబుళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతర్గాం మండలానికి 12, పాలకుర్తి మండలానికి 21, కమాన్‌పూర్ మండలానికి 13, రామగిరి మండలానికి 23, మంథని మండలానికి 24, ముత్తా రం మండలానికి 16, ధర్మారం మండలానికి 36, పెద్దపల్లి మండలానికి 35, జూలపల్లి మండలానికి 18, ఎలిగేడు మండలానికి 14, సుల్తానాబాద్ మండలానికి 30, ఓదెల మండలానికి 25, కాల్వశ్రీరాంపూర్ మండలానికి 24 టేబుల్స్ చొ ప్పున కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జేసీ వనజాదేవి, జిల్లా లైజన్ అధికారి వినోద్‌కుమార్, పెద్దపల్లి ఎంపీడీవో రాజు, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధికారులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...