కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి


Wed,April 24, 2019 02:41 AM

- ఎమ్మెల్యే కోరుకంటి చందర్
- పాలకుర్తి మండల పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభం
పాలకుర్తి: రామగుండం నియోజకవర్గంలో అంత ర్గాం, పాలకుర్తి మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం ఆయ న బసంత్‌నగర్ బస్టాండ్ వద్ద పాలకుర్తి మండల జడ్పీటీసీ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు విభేదాలు లే కుండా ఐకమత్యంగా పనిచేయాలని కోరారు. మే 5 వరకు ప్రతి గ్రామంలో పర్యటిస్తానని, గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీ, మహిళా కమిటీలు, ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించి, పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. పార్టీ టికెట్ ఆశిస్తున్న వారందరికీ న్యాయం చేస్తానని, టికెట్ రానివారికి రాబోయే రోజుల్లో ఇతర నామినేటేడ్ పోస్టుల్లో నియమిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, పెంట రాజేశ్, శ్రీనివాస్‌రెడ్డి, కందుల పోచం, చింతల సత్యనారాయణ, తంగెడ అనిల్‌రావు, పాత శ్రీధర్, తిరుమలచారి, మాదాసు సతీశ్, చిప్ప రవి, అచ్చ వే ణు తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...