టీఆర్‌ఎస్ ధర్మారం జడ్పీటీసీ అభ్యర్థిగా పద్మజ


Wed,April 24, 2019 02:40 AM

ధర్మారం: టీఆర్‌ఎస్ ధర్మారం మండల జడ్పీ అభ్యర్థిగా ధర్మారానికి చెందిన పూస్కూరు పద్మజ అభ్యర్థిత్వం ఖరారైంది. ఆమెకు పార్టీ బీ ఫారాన్ని కరీంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం అందజేశారు. పద్మజ ధర్మారం సర్పంచ్ పూస్కూరు జితేందర్‌రావు సతీమణి. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి జితేందర్‌రావు పని చేస్తున్నా రు. పద్మజ గ్రామ శ్రీరామాలయ ధర్మకర్తగా కొనసాగుతున్నారు. టీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఉన్న జితేందర్‌రావుకు పార్టీ వ్యవహారంలో ఆయన సతీమణి పద్మజ చేదోడు వాదోడుగా ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పక్షాన ఓటు వేయాలని ధర్మారంలో ఓట్లను అభ్యర్థించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ధర్మారం జడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వుడు కావడంతో పద్మజను టికెట్ వరించింది. ఆమె పేరును రాష్ట్ర సంక్షేమ మంత్రి ఈశ్వర్ ఖరారు చేశారని పిలువును రావడంతో జితేందర్‌రావు దంపతులు పలువురు పార్టీ నాయకులతో కలిసి మంత్రి నుంచి బీ ఫారాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రికి పద్మజ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్‌కు వెళ్లిన వారిలో జడ్పీ సభ్యుడు నార బ్రహ్మయ్య, పార్టీ మండలాధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి, కొత్తూరు ఎంపీటీసీ సభ్యుడు తాళ్లపల్లి లింగయ్య, రైతు సమన్వయ సమితి మండల సభ్యుడు పాక వెంకటేశం, నాయకులు పూస్కూరు రామారావు, ఎండీ రఫీ, కోరుకంటి స్వామి తదితరులు ఉన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...