రెండో రోజూ నామినేషన్ల జోరు


Wed,April 24, 2019 02:40 AM

కలెక్టరేట్ : స్థానిక సంస్థల కోసం తొలిదశ ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న 69 ఎంపీటీసీ స్థానాలకు, 7 జడ్పీటీసీ స్థానాలకు రెండో రోజు నామినేషన్ల హోరు కొనసాగింది. జిల్లాలోని 69 ఎంపీటీసీ స్థానాలకు రెండో రోజు మంగళవారం 56 మంది అభ్యర్థులు 57 నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి రోజు 69 ఎంపీటీసీ స్థానాలకు 33 మంది అభ్యర్థులు 34 నామినేషన్లను దాఖలు చేయగా, రెండు రోజుల్లో ఎంపీటీసీ స్థానాలకు 91 నామినేషన్లు దాఖలయ్యాయి. 7 జడ్పీటీసీ స్థానాలకు మొదటి రోజు 8 నామినేషన్లు దాఖలు కాగా, రెండో రోజు ఏడు జడ్పీటీసీ స్థానాలకు తొమ్మిది మంది అభ్యర్థులు 10 నామినేషన్లను దాఖలు చేయగా, రెండు రోజుల్లో మొత్తం జడ్పీటీసీ స్థానాలకు 18 నామినేషన్లు దాఖలయ్యాయి. ధర్మారంలో ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు శర్మన్ సందర్శించి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. కమాన్‌పూర్ జడ్పీటీసీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తరుపున ఆ పార్టీ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. 69 ఎంపీటీసీ స్థానాలకు గాను బీజేపీ నుంచి తొమ్మిది, కాంగ్రెస్ నుంచి 21, టీఆర్‌ఎస్ నుంచి 37, స్వతంత్రులుగా 24 చొప్పున మొత్తం 91 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఏడు జడ్పీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి 4, కాంగ్రెస్ నుంచి 3, ఏఐఎంఐఎం నుంచి 3, టీఆర్‌ఎస్ నుంచి 5, స్వతంత్రులు 3 చొప్పున మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. అంతర్గాం మండలంలోని 5 ఎంపీటీసీ స్థానాలకు 11 నామినేషన్లు, జడ్పీటీసీ స్థానానికి 3, పాలకుర్తి మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు 20 నామినేషన్లు, జడ్పీటీసీ స్థానానికి 3, కమాన్‌పూర్ మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలకు 13 నామినేషన్లు, జడ్పీటీసీ స్థానానికి 3, రామగిరి మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు 10 నామినేషన్లు, జడ్పీటీసీ స్థానానికి 2 నామినేషన్లు, ధర్మారం మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు 13 నామినేషన్లు, జడ్పీటీసీ స్థానానికి 2, మంథని మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు 16 నామినేషన్లు, జడ్పీటీసీ స్థానానికి 3, ముత్తారంలో 8 ఎంపీటీసీ స్థానాలకు 8 నామినేషన్లు, జడ్పీటీసీ స్థానానికి 2 నామినేషన్ల చొప్పున తొలి దశలో జరుగుతున్న 69 ఎంపీటీసీ స్థానాలకు రెండు రోజుల్లో 91 నామినేషన్లు దాఖలు కాగా, 7 జడ్పీటీసీ స్థానాలకు 18 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు సాదాసీదాగా సాగినప్పటికీ రెండో రోజు నామినేషన్ల పర్వం హోరెత్తింది. నామినేషన్ల స్వీకరణకు ఒకే రోజు గడువు ఉండటం, రెండో రోజు మంగళవారం కావడంతో చాలా మంది ఆశావాహులుగా ఉన్న అభ్యర్థులంతా చివరి బుధవారం పెద్ద ఎత్తున తమ మద్దతుదారులతో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లను దాఖలు చేసేందుకు సంసిద్ధులవుతున్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...