చెరువులో మునిగి విద్యార్థి మృతి


Wed,April 24, 2019 02:40 AM

ఓదెల : మండల కేంద్రానికి చెందిన ఆశా కర్యకర్త సరిత - రాజేశం ల కుమారుడు గడ్డం సృజన్(13) మంగళవారం ప్రమాదవశాత్తు చెరువు నీటిలో మునిగి మృతి చెందినట్లు ఏఎస్‌ఐ మీర్జా బేగ్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు, సృజన్ వేసవి సెలవుల కారణంగా ఇంటి వద్ద ఉన్నాడు. మంగళవారం మధ్యాహ్న వేళ తోటి స్నేహితులతో ఆడుకోవడానికి ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో బహిర్భూమి రావడంతో గ్రామంలోని ఊరకుంట చెరువు వద్దకు వెళ్లి చెరువు నీటితో కడుక్కునే సమయంలో కాలు జారీ నీటిలో మునిగాడు. గమనించిన ఇద్దరు అతనిని నీటిలోంచి తీశారు. వెంటనే కుటుంబ సభ్యులకు విషయం తెలిపి కాల్వశ్రీరాంపూర్ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, సృజన్ కరీంనగర్ జిల్లా మానకొండూర్ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువున్నట్లు తెలిపారు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన కొడుకు నీట మునిగి మృతి చెందడంతో సృజన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...