చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం..


Tue,April 23, 2019 12:53 AM

కలెక్టరేట్: రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామనీ, అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కలెక్టర్ శ్రీదేవసేన హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని రైతాంగంపై వర్షం ప్రభావం పడకుండా పౌర సరఫరాల శాఖ తగిన చర్యలు చేపడుతుందన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో 178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామనీ, అందులో ఇప్పటి వరకు పీఏసీఎస్‌ల ద్వారా 90, ఐకేపీ ద్వారా 48 చొప్పున మొత్తం 138 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నామన్నారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన గన్నీ సంచులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అధికారుల నేతృత్వంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. టోల్‌ఫ్రీ నెంబర్ 180042500333, వాట్సప్ నెంబర్ 7330774444ల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఆ ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందిస్తారని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే ముందు రైతులు స్థానిక పరిస్థితులకనుగుణంగా ఆలోచించి తక్కువ తేమ శాతం ఉన్న ధాన్యాన్నే తీసుకొచ్చేలా కేంద్రాల నిర్వాహకులు రైతుల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. రైతులు కూడా ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...