ప్రభుత్వ చొరువతో పాలన సుగమం


Tue,April 23, 2019 12:53 AM

రామన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం చొరువతో గ్రామాల్లో పంచాయతీ సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలను చేపట్టి ప్రజలకు న్యాయమైన పాలన అందించేందుకు కృషి చేయడం హర్షణీయం. ఈ తరహాలోనే మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో నూతనంగా 14 మంది జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు పదవి బాధ్యతలు చేపట్టారు. గతంలో మొత్తం ఐదుగురు గ్రామ పంచాయతీ కార్యదర్శులే ఉన్నారు. ఒక్కొక్కరు 4 నుంచి 5 గ్రామాలకు ఇన్‌చార్జి కార్యదర్శులుగా విధులు నిర్వహించే వారు. ఇద్దరు కార్యదర్శులు సెలవులపై వెళ్లగా నూతనంగా ప్రభుత్వం నియమించిన జూనియర్ కార్యదర్శులు పదవీ బాధ్యతలు చేపట్టారు. గ్రామాల్లో కొన్నేండ్లుగా ఇన్‌చార్జి కార్యదర్శులుగా కొనసాగుతుండటంతో పరిపాలన, పారిశుధ్యం, తాగు నీటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నూతనంగా 14 మంది కార్యదర్శులు పదవీ బాధ్యతలు చేపట్టడంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించబడుతాయని ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...