నాడు పశువుల కాపరి.. నేడు వ్యాపారవేత్త


Tue,April 23, 2019 12:53 AM

ఆత్మకూరు(ఎం): కుటుంబ అవసరాల కోసం 30 ఏండ్ల కింద చేసిన అప్పు కిందికి తండ్రి మాట కాదనలేక చిన్నతనంలోనే పశువుల కాపరిగా జీతం ఉన్న వెంకట్‌రెడ్డి నేడు స్వయం కృషి, పట్టుదలతో కష్టపడి ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగాడు. మండల కేంద్రానికి చెందిన కొమిరెళ్లి సావిత్రమ్మలకా్ష్మరెడ్డిల కూమారుడైన కొమిరెళ్లి వెంకట్‌రెడ్డి రాత్రిబడిలో చదువుకుంటూ పశువుల కాపరిగా జీవనం సాగించాడు. 15 ఏండ్లకే బతుకుదెరువు కోసం హైదారాబాద్‌కు పోయి కష్టాన్ని నమ్ముకొని దొరికిన పని చేసుకుంటూ తనకున్న తెలివి తేటలతో అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకట్‌రెడ్డి. తన సంపదలో కొంత సొంత ఊరిలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపనకు రూ. లక్ష 50వేలు, సాగుబావి మైసమ్మ ఆలయ ప్రహరీ నిర్మాణానికి రూ.2లక్షల 50వేలు, తెలంగాణ తల్లి విగ్రహానికి రూ.40వేలు, నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుభాష్‌చంద్రబోస్ విగ్రహం చుట్టూ రూ.50వేలతో ఇనుప వీల్స్‌తో కూడిన మెట్ల నిర్మాణం, అంగడి బజార్‌లోని శ్మశాన వాటికలో రూ.2లక్షల 50 వేలతో స్నానాల గదుల నిర్మాణం, శాంతినగర్‌లో వినాయక ఉత్సాహక కమిటీకి రూ. 40వేలతో సౌండ్‌బాక్స్‌లు, గ్రామంలో ప్రతి ఏడాది నిర్వహించే గ్రామీణ క్రీడోత్సవాలకు రూ.10వేలతో బహుమతులను అందజేయడంతో పాటు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టిన తనవంతు సహకారం అందిస్తూనే ఉన్నాడు వెంకట్‌రెడ్డి.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...