ధాన్యం బస్తాలు లేక కొనుగోళ్లు ఆలస్యం


Tue,April 23, 2019 12:53 AM

సూర్యాపేట వ్యవసాయం : జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులు సోమవారం 65వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రానికి రావాల్సిన ఖాలీ బస్తాలు సమయానికి రాకపోవడంతో పాటు ఎక్కువ మొత్తంలో ఉన్న బస్తాలను తరలించడంలో మిల్లుల యజమానులు చేస్తున్న ఆలస్యం, వాతావరణ పరిస్థితుల కారణంగా కొంత ఆలస్యం అవుతుండడంతో రైతులు మార్కెట్ సమీపంలోని జాతీయ రహదారి ఎన్‌హెచ్ 65 పై రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం ఎక్కువగా తీసుకొస్తుంటే బస్తాలను అందుబాటులో ఉంచడంలో నిర్వాహకులు విఫలమయ్యారని రైతులు తెలిపారు.

టోకెన్ విధానంతో పెరిగిన ధాన్యం..
వ్యవసాయ మార్కెట్‌లో అధికారులు టోకెన్ విధానం అమలు చేస్తుండడంతో మార్కెట్‌లో అమ్ముకుందామని వచ్చినా టోకెన్ లేని రైతులు సైతం ధాన్యాన్ని పక్కనే ఉన్న కొనుగోలు కేంద్రానికి తరలిస్తున్నారు. దీంతో పీఏసీఎస్ కేంద్రానికి వస్తున్న ధాన్యం కొంత పెరిగింది. కేంద్రాల ద్వారా అమ్ముకునే రైతులకు ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1770, బీ గ్రేడ్‌కు రూ.1750లు అందిస్తుండడంతో రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు.

జాయింట్ కలెక్టర్ హామీ..
రైతులు జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న సమాచారం తెలుసుకున్న జాయిట్ కలెక్టర్ సంజీవరెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఎక్కడ సమస్యలు ఏర్పడుతున్నాయని సమాచారం తెలుసుకున్న జేసీ ఖాలీ బస్తాలను కొనుగోలు కేంద్రాలకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. జేసీ ఆదేశాల మేరకు ఖాళీ బస్తాలు పంపించడంతో వాటిని రైతులకు అందించి కాంటాలు ప్రారంభించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...