ప్రాదేశిక పోరుకు సై


Mon,April 22, 2019 02:38 AM

-ఉదయం 10:30 గంటలకు విడుదల
-ఆ మరుక్షణం నుంచే నామినేషన్ల స్వీకరణ
-మొదటి దఫా ఏడు జడ్పీ, 69 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
-అధికార యంత్రాంగం బిజీబిజీ.. ఏర్పాట్లు పూర్తి
పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ / కలెక్టరేట్ : జిల్లాలో నేటి నుంచి పరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్నది. మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో ఏడు జడ్పీటీసీ స్థానాలకు, 69 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలి విడతలో మంథని, ముత్తారం, కమాన్‌ఫూర్, రామగిరి, పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం జడ్పీటీసీ స్థానాలు 69 ఎంపీటీసీ స్థానాలు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో ఎన్నికల నిర్వహణ కోసం నేడు ఉదయం 10.30 గంటకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ మరు క్షణం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. తొలి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం ఈ నెల 24న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు స్వీకరణ కోసం ఏడు మండలాల పరిధిలో అన్ని ఏర్పాట్లు చేశారు.

నామినేషన్లు కోసం ఏర్పాట్లు..
నేటి నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రి య కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. 13 జడ్పీటీసీ స్థానాలకు 14 మంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించగా, 138 ఎంపీటీసీ స్థానాలకు 58 మంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులను, 59 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద క్లస్టర్ల వారీగా నామినేషన్లు స్వీకరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన సామాగ్రిని ఇప్పటికే ఆయా మండల కేంద్రాలకు తరలించారు. నేటి నుంచి తొలి విడత నిర్వహిస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు స్వరం సిద్దం చేశారు.

జడ్పీటీసీ నామినేషన్ కేంద్రాలు..
మంథని మండల జడ్పీటీసీ స్థానానికి, మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు మంథని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. అలాగే, ముత్తారం జడ్పీటీసీ స్థానానికి, ఎంపీటీసీ స్థానాలు ముత్తారం ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. రామగిరి మండలంలో మండల పరిషత్ భవనం లేక పోవడంతో పన్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో, కమాన్‌పూర్ జడ్పీటీసీ స్థా నానికి, ఎంపీటీసీ స్థానాలకు కమాన్‌పూర్ ఎంపీడీఓ కార్యాలయంలో, పాలకుర్తి, అంతర్గాం మండల జ డ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రామగుండం మండల పరిషత్ కార్యాలయంలో, ధర్మారం జడ్పీటీసీ స్థానానికి, ఎంపీటీసీ స్థానాలకు ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు.

ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాలు ఇక్కడే..
ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన నామినేషన్లు క్లస్టర్ల వారీగా స్వీకరించడానికి ఏర్పాట్లు చేశారు. ఇం దులో మంథని మండలానికి సంబంధించి గుంజపడుగు క్లస్టర్‌లో గుంజపడుగు, ఉప్పట్ల, చిల్లపల్లి గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు, ఎక్లాస్‌పూర్ క్లస్టర్‌లో ఎక్లాస్‌పూర్, సూరయ్యపల్లి, గద్దలపల్లి గ్రామాల అభ్యర్థులవి, అక్కెపల్లి క్లస్టర్‌లో అక్కెపల్లి, లక్కేపూర్, కన్నాల గ్రామాల అభ్యర్థులవి, నాగేపల్లి క్లస్టర్‌లో నాగేపల్లి, ఆరెంద గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారు.
4ముత్తారం మండలానికి సంబంధించి లక్కారం క్లస్టర్‌లో లక్కారం, మైదంబండ, ఇప్పలపల్లి గ్రామా ల అభ్యర్థులవి, పారుపల్లి క్లస్టర్‌లో పారుపల్లి, ము త్తారం, ఓడేడు గ్రామాల అభ్యర్థులవి, అడవిశ్రీరాంపూర్ క్లస్టర్‌లో అడవిశ్రీరాంపూర్, ఖమ్మంపల్లి గ్రా మాల అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారు.
4అంతర్గాం మండలంలోని గోలివాడ క్లస్టర్‌లో గోలివాడ, పెద్దంపేట, ముర్మూర్ గ్రామాల అభ్యర్థులవి, బ్రాహ్మణపల్లి క్లస్టర్‌లో బ్రాహ్మణపల్లి, పొట్యాల గ్రామాల అభ్యర్థుల స్వీకరిస్తారు.
4పాలకుర్తి మండలానికి సంబంధించి కన్నాల క్లస్టర్‌లో కన్నాల, ఎల్కలపల్లి, రాణాపూర్ గ్రామాల అభ్యర్థులవి, పాలకుర్తి క్లస్టర్‌లో పాలకుర్తి, బసంత్‌నగర్, ఘన్‌శ్యామ్‌దాస్‌నగర్ గ్రామాల అభ్యర్థులవి, ఈసాలతక్కళ్లపల్లి క్లస్టర్‌లో ఈసాలతక్కళ్లపల్లి, పుట్నూరు, కొత్తపల్లి గ్రామాల అభ్యర్థులవి, కుక్కలగూడూరు క్లస్టర్‌లో కుక్కలగూడూరు, ముంజంపల్లి గ్రామాల అభ్యర్థుల నామినేషన్లు తీసుకుంటారు.

4ధర్మారం మండలానికి సంబంధించి ధర్మారం క్లస్టర్‌లో ధర్మారం-1, ధర్మారం-2, బొమ్మారెడ్డిపల్లి అభ్యర్థులవి, మేడారం క్లస్టర్‌లో మేడారం-1, మేడారం-2, గోపాల్‌రావుపేట్ అభ్యర్థులవి, బంజేరుపల్లి క్లస్టర్‌లో బంజేరుపల్లి, పత్తిపాక, కమ్మర్‌ఖాన్‌పేట గ్రామాల అభ్యర్థులవి, కటికనపల్లి క్లస్టర్‌లో కటికనపల్లి, కొత్తూరు, ఖిలావనపర్తి గ్రామాల అభ్యర్థులవి, దొంగతుర్తి క్లస్టర్‌లో దొంగతుర్తి, రచ్చపల్లి, ఖానంపల్లి అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారు.
4రామగిరి మండలానికి సంబంధించి సుందిళ్ల క్లస్టర్‌లో సుందిళ్ల, జల్లారం, పెద్దంపేట గ్రామాల అభ్యర్థులవి, పన్నూరు క్లస్టర్‌లో పన్నూరు-1, పన్నూరు-2, పన్నూరు-3 అభ్యర్థులవి, బేగంపేట క్లస్టర్‌లో బేగంపేట, రత్నాపూర్, కల్వచర్ల అభ్యర్థులవి, నాగేపల్లి క్లస్టర్‌లో నాగేపల్లి, లద్నాపూర్, బుధవారంపేట గ్రామాల అభ్యర్థులవి తీసుకుంటారు.
4కమాన్‌పూర్ మండలానికి సంబంధించి కమాన్‌పూర్-1 క్లస్టర్‌లో కమాన్‌పూర్-1, కమాన్‌పూర్-2 అభ్యర్థులవి, జూలపల్లి-1 క్లస్టర్‌లో జూలపల్లి-1, జూలపల్లి-2 అభ్యర్థులవి, గుండారం క్లస్టర్‌లో పెంచికల్‌పేట, రొంపికుంట, గుండారం గ్రామాల అభ్యర్థుల నామినేషన్లు తీసుకుంటారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...