సీనియర్ సిటిజన్ల సమస్యలు పరిష్కరించాలి


Mon,April 22, 2019 02:36 AM

-సమావేశంలో తీర్మానం
గోదావరిఖని, నమస్తే తెలంగాణ : సింగరేణిలో సుదీర్ఘ కాలం పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సమస్యలు పరిష్కరించాలని కోరారు. గోదావరిఖనిలో ఆదివారం సీనియర్ సిటిజన్స్ సోషల్ సర్వీసు ఆర్గనైజేషన్, సింగరేణి కోల్‌మైన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా గౌరవాధ్యక్షుడు పీటీ స్వామి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొప్పుల ఈశ్వర్ విశ్రాంత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి రిటైర్డు కార్మికులకు కనీసంగా రూ. 5 వేల పెన్షన్ ఇవ్వాలనీ, ఆర్టీసీ బస్సులో సీనియర్ సిటిజన్లకు రాయితీ కల్పించాలనీ, వృద్దులకు విశ్రాంతి గృహాలు ఏర్పాటు చేసి అన్ని వసతులు ప్రభుత్వం కల్పించాలనీ, బ్యాంకులలో సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటుచేయాలనీ, సింగరేణిలో రిజక్ట్ క్వార్టర్లను విశ్రాంత కార్మికులకు కేటాయించాలనీ, కమిటీని మార్పుచేయాలని తీర్మాణించినట్లు పేర్కొన్నారు. పూరెళ్ల వెంకటేశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు గంట సత్తయ్య, ఎ.రాంచందర్‌రావు, వి.వెంకటేశ్వర్‌రావు, పి.నాగరాజు, జైహింద్, బోగరాజు, లకా్ష్మరెడ్డి, దర్మయ్య, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...