భారీ మెజార్టీతో గెలిపించాలి


Mon,April 22, 2019 02:36 AM

-గ్రామాల్లో జడ్పీటీసీ సంధ్యారాణి, టీఆర్‌ఎస్ ముఖ్యనాయకుల ప్రచారం
పాలకుర్తి : మండలంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల విజయం కోసం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాలమేరకు ముఖ్యనాయకులు ఆదివారం పలు గ్రామాల్లో పర్యటించారు. జయ్యారం, పుట్నూర్, గుడిపల్లి, కుక్కలగూడూర్ గ్రామాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. పాలకుర్తి మండల జడ్పీటీసీతోపాటు, 11 ఎంపీటీసీ స్థానాలు టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకునేలా గ్రామాల్లోని కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాలను గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, ఉచిత కల్యాణలక్ష్మి, షాదీముభారక్ వంటి పథకాలను వివరించాలని కోరారు. ఇటీవల ప్రభుత్వం రెవెన్యూశాఖలో అవినీతి ఎండగట్టి, ప్రతి పేదవారికి ఉచితంగా భూసంబందిత పనులు సకాలంలో చేసేలా కృషిచేస్తుందని రైతులకు వివరించాలని కోరారు. సమావేశంలో టీఆర్‌ఎస్ ముఖ్యనాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, అచ్చవేణు, బొడ్డుపల్లి శ్రీనివాస్, తోకల రమేశ్, బిక్కినేని నర్సింగరావు, దుర్గం లింగయ్య, చింతకింది సత్యనారాయణ, చింతల మురళి, మామిడి సతీశ్, మోహన్‌గౌడ్, తోడేటి శంకర్‌గౌడ్, మామిడి రాజేందర్, మేకల శ్రీనాథ్‌యాదవ్, కుక్కలగూడూర్ సర్పంచ్ గొండ్ర చందర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం జడ్పీటీసీ కందులసంధ్యారాణి ఆదివారం మండలంలోని బసంత్‌నగర్‌లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మేజార్టీతో గెలిపించాలని కోరారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...