విజేతలకు అభినందన


Mon,April 22, 2019 02:35 AM

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : కోల్‌ఇండియాలో ఇటీవల జరిగిన బాడీ బిల్డింగ్, వెయిట్ లిప్టింగ్ పోటీల్లో విజయం సాధించిన విజేతలకు ఆదివారం గోదావరిఖనిలో అభినందించారు. గౌతమీ వెయిట్ లిప్టింగ్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలను సన్మానించి అభినందించారు. కోల్‌ఇండియా పోటీల్లో బాడీ బిల్డింగ్ విభాగంలో 90 కేజీల కేటాగిరిలో గోల్డ్‌మెడల్ సాధించిన గోలి సత్యనారాయణ, వెయిట్ లిప్టింగ్‌లో 66 కేజీల విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించిన కాపు ఆనంద్‌ను, బాడీ బిల్డింగ్‌లో 70 కేజీల విభాగంలో మొదటి స్థానం సాధించిన హాసీబుద్దీన్‌లను శాలువలు కప్పి, పూల మాలలు, మొమోంటోలతో సత్కారించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎంతో ప్రతిభతో పోటీల్లో రాణించడంపై వారిని అభినందిస్తూ, రానున్న రోజుల్లో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు చేరుకునేలా శిక్షణను ఇవ్వాలన్నారు. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో గౌతమీ వెయిట్ లిప్టింగ్ అకాడమీ నిర్వాహకులు అమంచ గౌతమ్, కోచ్ సలీం, మాటూరి సదానందం, ఎరికిళ్ల ప్రసాద్, అలీం, కృష్ణ, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...