టీబీజీకేఎస్‌తోనే హక్కుల సాధన


Mon,April 22, 2019 02:35 AM

- జాతీయ సంఘాలది తప్పుడు ప్రచారం
- సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు వెంకట్రావ్
గోదావరిఖని, నమస్తే తెలంగాణ : సింగరేణిలో కార్మికుల హక్కులను తాకట్టు పెట్టిన ఘనత జాతీయ కార్మిక సంఘాలదనీ, కానీ, ఆ సంఘాల నాయకులు టీబీజీకేఎస్ కార్మికులకు ఏం చేయడం లేదని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు బి.వెంకట్రావ్ పేర్కొన్నారు. గోదావరిఖని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీ పనిగట్టుకొని టీబీజీకేఎస్‌ను విమర్శించే పనిలో పడిందన్నారు. జేబీసీసీఐలో, సీఎంపీఎఫ్ ట్రస్టీ బోర్డు సమావేశాల్లో అసలు ఏం జరిగింది... ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే అంశంపై కార్మికులకు తెలియజేయాల్సిన జాతీయ కార్మిక సంఘాల నాయకులు, ఆ విషయం మరచిపోయి సింగరేణిలో టీబీజీకేఎస్ ఏం చేయడం లేదని అంటుందన్నారు.

గతంలో జాతీయ కార్మిక సంఘాలు సాధించని అనేక హక్కులను వారికన్న 10 రెట్లకు పైగా సాధించిన ఘనత కేవలం టీబీజీకేఎస్‌దేనన్నారు. సింగరేణిలో కారుణ్య నియమాకాల అమలు, క్యాడర్‌స్కీం, కార్మికుల సొంత ఇంటి కలను సాకారం చేస్తూ రూ. 10 లక్షల బ్యాంకు రుణంపై వడ్డీ మాఫీ లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఇటీవల టీబీజీకేఎస్ కార్యాలయంలో జరిగిన గొడవ అంశం తమకు తెలియదనీ, గొడవ జరిగిన అంశంపై విచారణ చేస్తామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, నాయకులు దేవ వెంకటేశం, నూనె కొమురయ్య, పెద్దపల్లి సత్యనారాయణ, కనకం శ్యాంసన్, మాదాసు రాంమూర్తి, వడ్డేపల్లి శంకర్, గండ్ర దామోదర్‌రావు, నాయిని మల్లేశ్, జనగామ శ్రీనివాస్‌గౌడ్, మండ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...