మంత్రి ఈశ్వర్ జన్మదిన వేడుకలు


Sun,April 21, 2019 01:21 AM

ధర్మారం: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధర్మారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు ఆధ్వర్యంలో శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ పూస్కూరు జితేందర్‌రావు, పార్టీ మండలాధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి సంయుక్తంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం నాయకులు ప్రైవేట్ దవాఖానల్లో పంపిణీ చేశారు. అలాగే రచ్చపల్లిలో సర్పంచ్ మోర సుధాకర్, కటికెనపల్లిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సర్పంచ్ కారుపాకల రాజయ్య కేక్ కట్ చేశారు. ధర్మారంలోని నాయీబ్రాహ్మణులు అనాథ ఆశ్రమానికి 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో కొత్తూ రు ఎంపీటీసీ సభ్యుడు తాళ్లపల్లి లింగయ్య, నాయకులు పాక వెంకటేశం, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, కాంపెల్లి చంద్ర శేఖర్, కూరపాటి శ్రీనివాస్, ఎండీ రఫీ, తోడేటి రాజలింగయ్య, ఒడ్నాల శంకరయ్య, దేవి రాజారాం, తోడేటి మురళి, దేవి రాజేందర్, దేవి సూర్యనారాయణ, రాగుల మల్లేశం, దేవి అజయ్, సోగాల మురళి, రచ్చపల్లిలో ఉప సర్పం చ్ చిందం మల్లేశం, దేవి వీరేశం, చింతల తిరుపతి, టి.రాజయ్య, దొనికెని తిరుపతి, సూర వెంకటేశం, కటికెనపల్లిలో పార్టీ మహిళ అధ్యక్షురాలు గుజ్జేటి కనకలక్ష్మి, నాయకులు పాటకుల బుచ్చిరాములు, జంగిలి రవి, మానుపాటి సాయిలు, కొమురవెళ్లి శివ శంకరాచార్యలు, సూరమల్ల ప్రభుదాస్, సూరమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

జూలపల్లి : మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వగ్రామం కుమ్మరికుంటలో శనివారం ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఈశ్వర్ మరెన్నో జన్మదిన వేడుకలు చేసుకోవాలని ఆకాంక్షించారు. ఇక్కడ సర్పంచ్ మేచినేని సంతోష్‌రావు, ఉప సర్పంచ్ కొత్త మల్లేశం, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శాత ళ్ల కాంతయ్య, నాయకులు కామ రాజు, కొప్పుల శ్రీధర్, మేచినేని ప్రసాద్‌రావు, కుంట రాజేశ్వర్‌రెడ్డి, తమ్మడవేని మల్లేశం, నల్లతీగల సతీశ్, దొంత తేజ, ఎక్కిరాల స్వామి, నాగెల్లి సాగర్, సంది సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో మంత్రి జన్మదిన వేడుకలు టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టాల మల్లేశం కేక్ కట్ చేశారు. పలువురు భక్తులకు కేక్, స్వీట్లు పంచి పెట్టారు.లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో మరి న్ని ఉన్నత పదవులు సొంతం చేసుకోవాలని ప్రా ర్థించారు. ఇక్కడ నాయకులు దండె వెంకటేశ్వర్లు, కామ రాజు, నాడెం మల్లారెడ్డి, కుంట రాజేశ్వర్‌రెడ్డి, తమ్మడవేని మల్లేశం, భూమల్ల నరేశ్, పిల్లి భూమయ్య, తొగరు శ్రీనివాస్, చొప్పరి మహేశ్, భూమల్ల ఐలయ్య, నిట్టు కొమురయ్య, భూమల్ల పోశాలు, రాయలింగం, ఖాసీం ఉన్నారు.

కలెక్టరేట్: మంత్రి ఈశ్వర్ జన్మదిన వేడుకలు పెద్దపల్లిలో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 6వ వార్డులో కౌన్సిలర్ ఉప్పు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో మంత్రి కేక్‌ను కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి, తినిపించు కున్నారు. అనంతరం కౌన్సిలర్ రాజ్‌కుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు ఉప్పు శివకుమార్ పటేల్, దుస్స సుధాకర్, గైని శ్రీనివాస్, గాజుల మోహన్, హబీబ్, అమిరిశెట్టి కార్తీక్, ముప్పిడి అరుణ్‌సాయి, సాయన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...