రాయపేట రిజర్వాయర్‌తో పుష్కలంగా నీరు


Sun,April 21, 2019 01:20 AM

కాల్వశ్రీరాంపూర్: లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాయపేట బోడగుట్టల వద్ద రిజర్వాయర్ నిర్మాణంతో ఈ ప్రాంత ఆయకట్టు రైతాంగానికి పుష్కలంగా సాగునీరు అందనుందని ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గంగా రం హుస్సేన్‌మియా వాగు వద పంపుహౌస్ ని ర్మాణ పనులతోపాటు రాయపేట గుట్టల్లో నిర్మించే రిజర్వాయర్ పనులను ఐడీసీ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్సేన్‌మియా వాగు నుంచి వర్షాకాలంలో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి ఇక్కడి నుంచి పైపులైన్ ద్వారా రాయపేట గుట్టలకు తరలించి అక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేసి దాని నుంచి మండలంలోని పందిళ్ల, పెద్దంపేట, రాయపేట, లక్ష్మీపూర్, కాల్వశ్రీరాంపూర్, చిన్నరాత్‌పల్లి దాకా ఉన్న 12 కుంటల్లో ఈ నీటిని నింపి రైతులకు సాగునీరు అందించేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. దీంతో మండలంలోని పలు గ్రామాలకు సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. ధర్మారం మండలం పత్తిపాక వద్ద నిర్మించే రిజర్వాయర్ పూర్తయితే ఎస్సారెస్సీ కాలువ నీరు డి-86 పరిధిలోని 47ఎల్ కాలువ ద్వారా ఈ రిజర్వాయర్ నింపుతామన్నారు.

వృథాగా పోయే హుస్సేనియావాగు, ఎస్సారెస్పీ కాలువ నీళ్లతో రాయపేట రిజర్వాయర్‌ను నింపి చెరువులకు, కుంటలకు సాగునీరందిస్తామన్నారు. నిధులు మంజూరై పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోపు పనులు పూర్తి కావస్తున్నాయన్నారు. ఎస్సారెస్పీ ప్రారంభించినప్పటి నుంచి మండ లంలోని రైతులు నీరందక ఇబ్బందులు పడ్డారన్నారు. సాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో హుస్సేనిమియా వాగునీరు వర్షాకాలంలో వృథాగా పోతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుపోగా, అనుమతి ఇచ్చి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఇందుకు రైతు ల పక్షాన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రైతులకు సాగునీటితో పాటు మత్స్యకారులకు ఉపాధి సైతం దొరుకుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, సర్పంచులు బండ రవీందర్‌రెడ్డి, బైరం రమేశ్, ఇరిగేషన్ ఎండీ లక్ష్మారెడ్డి, ఈఈ రమేశ్‌కుమార్, డీఈ మహేశ్‌చందర్‌రావు, నాయకులు పులి సత్యనారాయణరెడ్డి, ఆరెల్లి రమేశ్, బండ మల్లారెడ్డి, సతీశ్, ఇల్లందుల రమేశ్ తదితరులు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...