సృజనాత్మకత వెలికితీత..భవితకు భద్రత


Sun,April 21, 2019 01:20 AM

సుల్తానాబాద్‌రూరల్: గురుకుల విద్యార్థులు అన్ని రంగా ల్లో రాణించడమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చదువుతోపాటు జానపదాలు, అబాకస్‌లో ఇప్పటికే అధికారులు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా పిల్లల్లో సృజనాత్మకత వెలికితీసి.. వారి భవితకు భద్రత కల్పించేందుకు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంప్యూటర్‌లో కోడింగ్, లైఫ్‌స్కిల్స్‌పై తర్ఫీదు ఇస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గురుకుల విద్యాలయంలో ప్రభుత్వం విద్యార్థులకు లైఫ్‌లైన్ కెరియర్ కోచింగ్‌పై శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్‌లో కోడింగ్, కథలు, ముగ్గులు ఇతర అంశాలపై ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నది. కంప్యూటర్ పట్టు సాధించాలనే ఉద్దేశంతో ప్రభు త్వం ప్రత్యేకంగా ఈ ఏడాది వేసవి సెలవుల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులను 100మందిని శిక్షణకు ఎంపిక చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రీజియన్ పరిధి నుంచి మల్లాపూర్, గర్రెపల్లి, నందిమేడారం, చింతకుంట, చిన్నబోనాల, రామగుండం, నర్మాల, మద్దెనపల్లి, అల్గునూర్‌కు చెందిన గురుకుల విద్యాలయాల నుంచి 10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థినులను 11మంది చొప్పున మొత్తం 100 మందిని ఎంపిక చేశారు. ఎంపిక చేసి ఒక్కో గ్రూప్‌నకు 50 మంది చొప్పున 2 గ్రూపులకు కలిపి శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థినులు అతి తక్కువ సమయంలో కంప్యూటర్ విద్యపై పట్టు సాధించి ఇంటర్‌నెట్, కోడింగ్‌లో ఎదిగేలా తీర్చిదిద్దుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి శిక్షణకు వచ్చిన విద్యార్థినులకు మంచి భోజన వసతి సదుపాయాలను గురుకుల విద్యాలయం కల్పిస్తుంది. ఈ శిక్షణ తరగతులు ఈ నెల 10 నుంచి ప్రారంభమై ఈ నెల 24తేదీ దాకా కొనసాగనున్నట్లు ప్రిన్సిపాల్ సరస్వతి తెలిపారు. ఇద్దరు శిక్షకులు సలాలొద్దీన్, మధు ఒక్కో బ్యాచ్‌కు రోజూ 2.30 నుంచి 3.00 గంటల దాకా శిక్షణ ఇస్తున్నారు.

ప్రత్యేక తరగతులు..
బాలికలకు కంప్యూటర్ విద్యపైనే శిక్షణ ఇవ్వకుండా వారి భవిష్యత్‌కు భరోసా కల్పించేలా వారిని చైతన్య పరిచేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. బాలికల జీవితంలో ఎలా స్థిరపడాలి అందుకు ఏలాంటి చర్యలు తీసుకోవాలి. ఎలా ముందుకు సాగాలి అన్న విషయాలపై బోధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా బాల్య వివాహాలు అవుతున్నాయి. వాటి నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్రంలో పలు జిల్లాలోని ప్రభుత్వ ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. తల్లిదండ్రులకు దూ రంగా ఉంటూ విద్యను నేర్చుకుంటున్నారు. పాఠశాల గురుకులాల్లో పాఠాలను శ్రద్ధగా వింటూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా లక్ష్యాన్ని సాధించే దిశగా ముం దుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి స్వయం గా రాణించేలా శిక్షణ తీర్చిదిద్దుతున్నారు. బొమ్మలు వేసేలా, ప్రత్యేకంగా రాణించేలా తర్ఫీదు ఇస్తున్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...