నేడు పరిషత్ షెడ్యూల్


Sat,April 20, 2019 01:37 AM

- జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు
- సిద్ధమవుతున్న అధికారులు
- గెలుపు గుర్రాల అన్వేషణలో పార్టీలు
- పల్లెలో మొదలైన సందడి

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదల కానున్నది. జిల్లాలోని 13 జిల్లా పరిషత్ స్థానాలు, 138 మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, కలెక్టర్ శ్రీదేవసేన ఆధ్వర్యంలో అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నది. ప్రధాన పార్టీల టికెట్ల కోసం అభ్యర్థులు పోటీ పడుతుండగా, పల్లె లో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది.
జిల్లాలోని 13 జిల్లా పరిషత్ (జడ్పీటీసీ) స్థానా లు, 138 మండల ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ) ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు నేడు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి, జిల్లా ఎన్నికల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల, నిర్వహణపై సలహాలు, సూచనలు అందించా రు. జిల్లాలో మొత్తం 14 మండలాలుండగా రామగుండం అర్బన్ మండలం కావడంతో మిగిలిన 13 మండలాల పరిధిలోని 13 జడ్పీటీసీ, 138 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో ఏడు జడ్పీటీసీ, 69 ఎంపీటీసీ స్థానాలకు మే 6వ తేదీన, రెండో విడతలో ఆరు జడ్పీటీసీ, 69 ఎంపీటీసీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.

టికెట్ల కోసం ఆశావహుల ఆరాటం..
ఓవైపు ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తుండగా, ప్రధాన పార్టీల టికెట్ల కోసం ఆశావహులు ఆరాట పడుతున్నారు. ఎన్నికల్లో గెలువాలని భావిస్తున్న అభ్యర్థులు, టీఆర్‌ఎస్ టికెట్ సాధిస్తే విజయం ఖాయమనే భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలకన్నా ముందుగానే టీఆర్‌ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును ఖరా రు చేసింది. జిల్లా పరిషత్ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలతోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారు. ఇటీవలే టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో హైదరాబాద్‌లో సమావేశమైన సీఎం ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...