మార్మోగిన హనుమాన్ నామస్మరణ


Sat,April 20, 2019 01:35 AM

కలెక్టరేట్: జై బోలో హనుమాన్‌కి.. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ శుక్రవారం హనుమాన్ ఆలయాలన్నీ మార్మోగాయి. చిన్న హనుమాన్ జయంతి సందర్భం గా పెద్దపల్లిలో వేడుకలను ఆలయాల ప్రధాన పూజారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో రోడ్‌లోని రామభక్త ఆంజనేయస్వామి ఆలయంలో ప్రధాన పూజారి కసోజుల క్రిష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో పూజలు చేశారు. పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి-పుష్పలతారెడ్డి దంపతులు, కౌన్సిలర్ కొం తం మల్లేశ్వరి-శ్రీనివాస్‌రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 108 కలశాల్లో గోదావరి జలాలను ఆంజనేయస్వామి మాలధరులు, భక్తులు ఒకరికొకరు అందజేసుకుంటూ ఆంజనేయస్వామికి అభిషేక పూజ లు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేయగా, ఆంజనేయస్వాములంతా భిక్ష ఆరగించిన అనంతరం భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎల్లమ్మ గుండమ్మ చెరువు మినీ ట్యాంకుబండ్‌పై ఉన్న మార్వాడీల ఆంజనేయస్వామి ఆలయం, తెనుగువాడలతోపాటు పెద్దపల్లి మండలం చీకురా యి, నిట్టూరు, రాఘవాపూర్, రంగాపూర్ గ్రామాలతో పా టు పలు గ్రామాల్లో వేడుకలను ఘనంగా చేపట్టారు. ఆయా గ్రామాల్లో వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వాములు, భక్తులకు ఆలయాల నిర్వహణ కమిటీ సభ్యులు అన్నదానం చేశారు. రామభక్త ఆంజనేయస్వామి ఆలయంలో చేపట్టిన వేడుకల్లో మాల ధరించిన ఆంజనేయస్వాములంతా పెద్ద ఎత్తున రామనామ స్మరణతో భజనలు చేయగా, మహిళా భక్తులంతా వారికి శృతి కలిపారు. ఆంజనేయస్వామికి అభిషేకం సందర్భంగా చివరగా గోదావరి జలాలను రాజేశ్ శర్మ తీసుకొస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో ఎదురుపడి మొక్కులు పెట్టా రు. వేడుకల్లో కౌన్సిలర్ల ఫోరం అధ్యక్షుడు ఉప్పు రాజు, ధర్మకర్తల మండల సభ్యులు మొగుళ్లపల్లి కృష్ణమూర్తి, ఆడెపు సుధాకర్ తదితరులున్నారు.

ఓదెల: మండలంలోని పలు గ్రామాల్లోని భక్తాంజనేయస్వామి ఆలయాల్లో హను మాన్ జయంతి సందర్భంగా శుక్రవారం వేడుకలు చేపట్టారు. ప్రత్యేక పూజలు చేశారు. అబ్బిడిపల్లి, కొలనూర్, గోపరపల్లి గ్రామాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలు, హనుమాన్ దీక్షాపరులు పూజల్లో పాల్గొన్నారు. అబ్బిడిపల్లిలో వేదపండితుడు వల్లూరి మహేశ్ పూజలు నిర్వహించారు.

కాల్వశ్రీరాంపూర్ : మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామా ల్లో హనుమాన్ జయంతి వేడుకల్లో చేపట్టారు. ఆయా హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. హనుమాన్ మాలధారులు , భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. 21రోజుల పాటు దీక్షలు చేసిన ఆంజనేయ భక్తులు ఇరుముడులతో భజన పాటలు పాడుకుంటూ, రామనామ స్మరణతో కొండగట్టుకు బయలుదేరి వెళ్లారు. రామనామస్మరణతో గ్రామాలన్నీ మార్మోగాయి.

హైందవ సంస్కృతిని కాపాడుకోవాలి
పెద్దపల్లిటౌన్: హైందవ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుకు ఉందని హైందవ గురువు శ్రీవిద్యాగణేశానంద భారతి పేర్కొన్నారు. హన్మాన్ జయంతి సందర్భంగా పెద్దపల్లిలో బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ర్యాలీలో శ్రీవిద్యాగణేశానంద భారతి పాల్గొన్నారు. స్థానిక ఎల్లమ్మ చెరువు నుంచి ప్రారంభమైన ర్యాలీ పుర వీధుల్లో సాగింది. ఈ సందర్భంగా శ్రీవిద్యాగణేశానంద మాట్లాడుతూ, ప్రతి హిందువు క్రమశిక్షణతో మెలుగాలని సూచించారు. బీజేవైం రాష్ట్ర నాయకుడు బెజ్జంకి దిలీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో నాయకులు రాపర్తి గోపి, శివంగారి సతీశ్, రాజేశ్వర్‌రావు, మహంతకృష్ణ, వంశీ, చిరంజీవి, అంజి, మధు తదితరులున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...