మంత్రి కొప్పుల మనువడి పాదయాత్ర


Fri,April 19, 2019 02:39 AM

జూలపల్లి : కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి దక్కడంతో ఆయన మనవడు కొప్పుల ఈశ్వర్, 50 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మొక్కు చెల్లించుకున్నాడు. తన మిత్రులు, అభిమానులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కొప్పుల స్వగ్రామం కుమ్మరికుంట నుంచి ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం దాకా కాలినడకన చేరుకున్నాడు. అంతకుముందు కుమ్మరికుంటలో సీ ఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల శ్రీధర్ మాట్లాడుతూ ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి రావాలని మొక్కుకున్నాననీ, ఆయన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ సాం ఘిక సంక్షేమ శాఖ మంత్రి పదవి ఇవ్వడంతో మొ క్కు చెల్లించుకుంటున్నానని తెలిపారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, టీఆర్‌ఎస్ నాయకుడు నల్ల మనోహర్‌రెడ్డి, నాయకులతో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. కుమ్మరికుంట నుంచి ధర్మారం మండలం కొత్తూ రు, మల్లాపూర్, ధర్మారం, వెల్గటూరు, రాయపట్నం ద్వారా ధర్మపురి దాకా పాదయాత్ర చేపట్టారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి మొక్కు చెల్లించుకున్నారు.

కొప్పుల ప్రజల మనిషి..
పాదయాత్ర సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కొప్పుల మంచితనం, పనితీరు, సేవా కార్యక్రమాలను చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనకు మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఆరుసార్లు గెలిచిన కొప్పుల ఈశ్వర్, వారి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షే మ ఫలాలు అందించడమే తమ లక్ష్యమనీ, ఈశ్వర్‌కు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తామని స్ప ష్టం చేశారు. సర్పంచ్ మేచినేని సంతోష్‌రావు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు శాతళ్ల కాంతయ్య, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ విశారపు వెంకటేశం, నాయకులు కొత్త మల్లేశం, కామ రాజు, దొంత తేజ, నల్లతీగల సతీశ్, కుంట రాజేశ్వర్‌రెడ్డి, తమ్మడవేని మల్లేశం, మేచినేని ప్రసాద్‌రావు, ఎక్కిరాల స్వామి, తోట ముత్తులింగం, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...