ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థుల ప్రతిభ


Fri,April 19, 2019 02:39 AM

పెద్దపల్లిటౌన్: ఇంటర్ ఫలితాల్లో పెద్దపల్లి గాయత్రి విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ ద్వితీయ మల్లెత్తుల అజయ్ (988), ఎర్రోజు శృతి (967), గుర్రం స్వాతి (951), బీపీసీలో రాజం సంధ్యారాణి (944), వి తులసి (960), ఎంఈసీలో నన్న సాయి అర్చన (944) మార్కులు సాధించారు. అలాగే ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో ఎ అంజలి (455), పల్లె ర్ల దుర్గా భవానీ (450), బీపీసీలో కాల్వ వైష్ణవి (414),టి స్వాతి, వి వైష్ణవి (402), సీఈసీలో ఆరె సుస్మిత (471) మార్కులు సాధించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ అల్లెంకి శ్రీనివాస్ బొకేలతో అభినందించారు. ఇక్కడ ప్రిన్సిపాల్ సురేశ్ అధ్యాపకులు ఉన్నారు.

సుల్తానాబాద్: శ్రీవాణి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో ఎండీ. సాజిద్ 980, బైపీసీ విభాగంలో కాట అక్షిత 937, సీఈసీ విభాగంలో పెర్క శ్రీవాణి 947 మార్కులు సాధించారు. అలాగే ఫస్టియర్‌లో ఎంపీసీలో ఎ. రమ్య 455, బైపీసీలో డి. రమ్య 422, సీఈసీలో నజ్రిన్ 477 మా ర్కులు సాధించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రేకులపల్లి విజయ్‌కుమార్ అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సదానందం, కమలాకర్, వైస్ ప్రిన్సిపాళ్లు బాలు, కుమార్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

కాల్వశ్రీరాంపూర్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 25శాతం, ద్వితీయ సంవత్సరంలో 51.51శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ విశ్వప్రసాద్ తెలిపారు. ద్వితీయ సంవత్సరం సీఈసీలో వి రామరాజుకు 726, పులి గణేశ్‌కు 667, బైపీసీలో కే పూజశ్రీ 737, ఎస్ కీర్తనకు 722, ఎంపీసీలో పోగుల కుమార్ 639 మార్కులు, ప్రథమ సంవత్సరం సీఈసీలో సీహెచ్ అనూష 403, పి రాము 395, బైపీసీలో జే ప్రశాంత్ 314, ఎస్ మహేశ్ 310, మార్కులు సాధించారని వివరించారు. మండలంలోని మల్యాల మోడల్ స్కూల్‌లో ప్రథమ సంవత్సరంలో 30శాతం, ద్వితీయ సంవత్సరంలో 36శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాదించారని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో ఎండీ సౌధ 900, బైపీసీలో జి రసజ్ఞ 888, సీఈసీలో కే అనిల్‌రెడ్డి 877, ప్రథమ సంవత్సరం సీఈసీలో ఏ శోభ 330, ఎంపీలో పి మణిచందన 374, బైపీసీలో పి అజయ్ 319 మార్కులు సాధించినట్లు వివరించారు. ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపీపీ సారయ్యగౌడ్, జడ్పీ సభ్యుడు సదయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ప్రశంసించారు.

సుల్తానాబాద్‌రూరల్: సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మాడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో డి. మౌనికకు 470/445 మార్కులు, బైపీసీలో ఏ ఐశ్వర్యకు 440/374 మార్కులు, సీఈసీలో ఎస్. శ్రీవాణికి 500/472 మార్కులను ఎంఈసీలో పి. ప్రియాంకకు 500/430 మార్కులు వచ్చాయి. మొదటి సంవత్సరంలో మొత్తం 50 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్ సీఈసీలో ఇ.అంజలి 940, బైపీసీలో ఆర్.అనూష 921, ఎంపీసీలో కే.శ్రీజ 815 సాధించా రు. మొత్తం 71 శాతం ఉత్తీర్ణత వచ్చినట్లు గర్రెపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాంబాబు తెలిపారు. అలాగే గర్రెపల్లి గురుకుల విద్యాలయం మొదటి సంవత్సరంలో సీఈసీలో వి.ప్రవళిక 500/471 మార్కులు, హెచ్‌ఈసీలో శైలజ 500/432 మార్కులు, ఆర్ట్స్‌లో కే.అనూష 500/475 సాధించారు. మొత్తం 86 ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్ సీఈసీలో మాసన 1000/940, హెచ్‌ఈసీలో ఏ ప్రియదర్శిణి 1000/ 899 మార్కులు సాధించారు. 82 శాతం ఉత్తీర్ణత వచ్చిందని ప్రిన్సిపాల్ సరస్వతి తెలిపారు.
ఓదెల: మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్‌లో 57మంది విద్యార్థులు పరీక్షలు రాయ గా, 13మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అలాగే రెండో సంవత్సర పరీక్షలు 30 మంది రాయగా, 11 మంది మాత్ర మే పాసయ్యారు. ఎంపీసీలో అఖిల 470/333, బీపీసీలో రజిత 440/336, సీఈసీలో ఆశా 500/412 మార్కులు సాధించారు.

ధర్మారం: సాధన జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో బి.భాగ్యలక్ష్మి 971 మార్కులు, బైపీసీలో ఈ.రమ్య 973 మార్కులు, సీఈసీలో సీహెచ్ అంజలి 952 మార్కులు, ఫస్టియర్‌లో ఎంపీసీలో కె.సందీప్ 444 మా ర్కులు, బైపీసీలో పి. ప్రవళిక 416 మార్కులు, సీఈసీలో ఎ. మౌనిక 470 మార్కులు సాధించనట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ మల్లారెడ్డి చెప్పారు. నంది మేడారం బాలికల గురుకుల కళాశాలలో ఫస్టియర్‌లో 80.3 శాతం, సెకండియర్‌లో 90.8 శాతం ఫలితాలు వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి చంద్రకళ తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో గౌతమి 442 మార్కులు, బైపీసీలో ఎం.ఉపేక్ష 407 మార్కులు సాధించారు. ఇక సెకండియర్ ఎంపీసీలో బి.కావేరి 921 మా ర్కులు, బైపీసీలో సీహెచ్ సాద్విన్ 947 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ చెప్పారు. నంది మేడారం తెలంగాణ బాలుర కళాశాలలో ఫస్ట్ ఇంటర్ బ్యాచ్‌లో ఫస్టియర్ ఎంపీసీలో గొల్లెన సతీశ్ 455, బైపీసీలో మిట్టపల్లి పవన్ 403 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ రాఘవులు తెలిపారు. ధర్మారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండియర్ ఎంపీసీలో పి.మహేశ్ 825 మార్కులు, బైపీసీలో 899 మార్కులు, సీఈసీలో టి.సారిక 870 మార్కులు, హెచ్‌ఈసీలో ఎన్.మానస 712 మార్కులు సాధించినట్లు ఆత్రం శశి కిరణ్ తెలిపారు. ధర్మారం సామవేద కళాశాలలో సెకండియర్ ఎంపీసీలో సీహెచ్ రమ్య 969 మార్కులు, బైపీసీలో మనూష 907 మార్కులు, సీఈసీలో అనూష 934 మా ర్కులు, ఫస్టియర్ ఎంపీసీలో కావ్య 443 మార్కులు, బైపీసీలో అనూష 350 మార్కులు, సీఈసీలో 453 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ కుమార్ వెల్లడించారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...