పేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్ పథకం


Fri,April 19, 2019 02:39 AM

ధర్మారం : పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తున్నదని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి నియోజక వర్గం పరిధిలోని 64 మంది లబ్ధిదారులకు రూ.19,08,500 విలువైన చెక్కులు మంజూరు కాగా, కరీంనగర్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన ఎంతో మంది నిరుపేదలు సీఎంఆర్‌ఎఫ్ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారని తెలిపారు. కార్పొరేట్ దవాఖానలో చికిత్స తీసుకుని అప్పుల పాలై ఇబ్బంది పడుతున్నవారికి, ఆర్థిక స్వావలంభన చేకూర్చేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఎవరైనా అనారోగ్య బాధితులు తనను నేరుగా సంప్రదిస్తే, వారికి ప్రభుత్వం ద్వారా సాయం చేయిస్తానని మంత్రి ఈశ్వర్ హామీ ఇచ్చారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...