వరదాయిని వచ్చేస్తోంది..


Thu,April 18, 2019 01:09 AM

- కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతం
- ఎల్లంపల్లి నుంచి మేడారం సర్జ్‌పూల్‌కు జలాల తరలింపు ప్రక్రియ విజయవంతం
- వేంనూర్ పంప్‌హౌస్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 3200 క్యూసెక్కులు విడుదల
- సాకారమవుతున్న రాష్ట్ర ప్రభుత్వ కల
- రెండు రోజుల్లో నందిమేడారం సర్జ్‌పూల్‌లోకి నీరు

రామగుండంరూరల్/ధర్మారం: తెలంగాణ వరప్రదాయినీ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి అంకానికి చేరాయి. వీలైనంత త్వరగా వచ్చే వర్షాకాలం కల్లా నీటిని తరలించి రైతాంగానికి సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, అందుకు అనుగుణంగా నీటి పారుదల యంత్రాంగం అడుగులు వేస్తున్నది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపులో భాగంగా ఆరు, ఏడు, ఎనిమిది ప్యాకేజీలు కీలకం కావడం, ఇక్కడే భారీ మోటార్లు ఉండడంతో వీటిపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే రామడుగు లక్ష్మీపూర్, నందిమేడారం టన్నెళ్లలో మోటార్లను డ్రైరన్‌ను విజయవంతం చేసిన క్రమంలో ఎల్లంపల్లి నీటిని ముందుగా నందిమేడారం సర్జ్‌పూల్‌కు తరలించి మోటార్ల వెట్న్(్రనీటిని ఎత్తిపోయం ద్వారా పరీక్షించే ప్రక్రియ పరీక్ష)కు అధికారులు సిద్ధమయ్యారు.

ట్రయల్ రన్ సక్సెస్..
నందిమేడారం భూగర్భంలోని పంప్‌హౌస్‌లో ఉన్న మోటార్ల డ్రైరన్ చేయడంలో భాగంగా ఎల్లంపల్లి జలాల తరలింపు ప్రక్రియలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. బుధవారం వేంనూర్ పంప్‌హస్ వద్ద కాళేశ్వరం ఇంజినీరింగ్ చీఫ్ వెంకటేశ్వర్లు, సీఎంఓ ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, కాళేశ్వరం టెక్నికల్ అడ్వైజర్ పెంటారెడ్డి, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ నూనె శ్రీధర్, ఏఈ ఉపేందర్, నవయుగ నిర్మాణ సంస్థ డైరెక్టర్ వెంకటరామారావు, జీఎం శ్రీనివాస్‌రావు సాంప్రదాయ పద్ధతిలో గోదావరితల్లికి హారతి ఇచ్చి, పూజలు చేసి, పంప్‌హౌస్ ఐదు షెటర్లలోని ఒక షెట్టర్‌ను పైకి ఎత్తి 3200 క్యూసెక్కుల నీటిని గ్రావిటీ కెనాల్‌లోకి విడుదల చేయగా, అక్కడి నుంచి 1.1 కిలోమీటర్ల దూరంలోని సొరంగాలలోకి విజయవంతంగా చేరాయి. దాదాపు 11 మీటర్ల డయా ఉన్న ఒక్కో సొరంగం దాదాపు 9.534 కిలోమీటర్ల పొడవున ఉండగా, ఈ సొరంగాల ద్వారా నీరు రెండు రోజులపాటు నందిమేడారాన భూగర్భంలో నిర్మించిన సర్జ్‌పూల్‌కు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత మేడారంలో ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న నాలుగు మోటార్లను వెట్న్ నిర్వహిస్తామని ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా, నీటి తరలింపు ట్రయల్ రన్ సక్సెస్‌కావడంతో ఇంజినీరింగ్ అధికారులు స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.

రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోస్తాం..
: సీఎంఓ ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే
ఈ యేడు వర్షాకాలంలో ఎల్లంపల్లి నుంచి 9 టీఎంసీలు వృథాగాపోయింది. ఈ సారి చుక్క నీరు వృథాకాకుండా చూస్తాం. ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి, వచ్చే వానాకాలం నాటికి రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోస్తాం. అప్పటివరకు అండర్‌టన్నెల్, సర్జ్‌పూల్ పంపులు పూర్తిగా అంతర్గత పరిశీలన చేసుకుంటాం. అందులో భాగంగా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకగట్టమైన 6వ ప్యాకేజీ నీటితరలింపు ప్రక్రియలో వేంనూర్ జీరో పాయింట్ నుంచి నందిమేడారం అండర్‌టన్నెల్‌కు పంపించాం. అక్కడ మోటార్లు సహా వివిధ పరీక్షలు విజయవంతం అయ్యాక, అండర్ టన్నెల్ ద్వారా మేడారం రిజర్వాయర్, మేడారం నుంచి రామడుగు మండలం లక్ష్మీపూర్, అక్కడి నుంచి మిడ్‌మానేర్, మిడ్‌మానేరు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి తరలిస్తాం.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...