రాజకీయ పార్టీలు సహకరించాలి


Thu,April 18, 2019 01:07 AM

కలెక్టరేట్: ఎంపీటీసీ, జడ్పీ సభ్యుల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జాయింట్ కలెక్టర్ వనజాదేవి కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ కార్యా లయ సమావేశ మందిరంలో బుధవారంసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా జేసీ మాట్లాడుతూ, జిల్లాలోని 13 మండలాల్లోని 13 జడ్పీటీసీ స్థానాలు, 138 ఎం పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 263 గ్రామాల్ల్లో 744 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో 3,75,050 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వివరించారు. మొదటి దశలో ఏడు మండలాల్లోని 69 ఎంపీటీసీ స్థానాలు, 7 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నామని తెలిపారు. మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం మండలాల్లో మొదటి దశ ఎ న్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే రెండోదశలో ఆరు మండలాల్లో 69 ఎంపీటీసీ స్థానాలు, 6 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు. రెండో దశలో పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వచ్చేనెల 6న మొదటి దశ ఎన్నికలకు పోలింగ్ ఉంటుందనీ, 10న రెండో దశ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 13 డిస్టిబ్యూషన్ కేంద్రాలు, 13 కౌంటింగ్ కేంద్రాలు, 13 స్ట్రాంగ్ రూమ్‌లను గుర్తించామన్నారు. జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు ఐదువేలు కాగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు 2500, ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు 2500కాగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 1250 చొప్పున డిపాజిట్ సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ సాయంత్రం 5గంటల వరకు మాత్రమే ఉంటుందన్నారు. మూడు ఎంపీటీసీ స్థానాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి మండల పరిషత్ కా ర్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. జడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్ తెలుపు, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్ గులాబీ రంగుల్లో ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బం దీగా, నిపక్షపాతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. సమావేశంలో జిల్లా లైజన్ అధికారి వినోద్‌కుమార్, ్ల పం చాయతీ అధికారి వేముల సుదర్శన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బాలసాని లెనిన్, తాం డ్ర సదానందం, కల్లెపల్లి అశోక్, అబ్దుల్ హకీం, కోనేరు వినాయకరావు తదితరులు న్నారు.

ఎన్నికల నియమావళి పాటించాలి
జూలపల్లి : రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రవర్తన నియమా వళి తప్పకుండా పాటించాలనీ, పూర్తి సహకారం అందించాలని ఇన్‌చార్జి ఎంపీడీఓ రమాదేవి, మండల ప్రత్యేకాధికారి క్రిష్ణారెడ్డి కోరారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం లో మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దని సూచించా రు. అన్ని పార్టీలు శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రచారం చేసుకోవాలని కోరారు. ప్రచారాలకు ఎన్నికల అధికారుల నుంచి తప్పకుండా అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇక్కడ టీఆర్‌ఎస్, బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీ ల ప్రతినిధులు శాతళ్ల కాంతయ్య, సీపెల్లి కొమురయ్య, ఎర్రోళ్ల రాములు, మల్లారపు హన్మంతు, మానుమండ్ల శ్రీని వాస్, సీపెల్లి అంజయ్య, నెరువట్ల రామస్వామి, సీపెల్లి శంకరయ్య ఉన్నారు.

ధర్మారం: మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో ఎంపీడీఓ బాలరాజు బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం పీడీఓ మాట్లాడుతూ, జడ్పీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. మండల పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నిర్వహణకు సహకరించి విజయవంతానికి సహకరించాలని కోరారు. సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గుర్రం మోహన్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పి. జితేందర్‌రావు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సల్వాజి మాధవరావు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...