అకాల వర్షంతో అతలాకుతలం


Thu,April 18, 2019 01:07 AM

పెద్దపల్లిటౌన్: నియోజకవర్గంలో బుధవారం సాయంత్రం ఈదులుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ దంచికొడుతుండగానే అకస్మాత్తుగా 80 -90 కిలోమీటర్ల వేగంతో గాలి ప్రారంభ మైంది. ఈ క్రమంలో పట్టణంలో రోడ్లకు అడ్డంగా పలు చెట్లు కూలిపోయాయి. అలాగే రోడ్ల పక్కన ఉన్న పలు దుకాణాలు గాలికి కుప్పకులాయి. ఆస్తి నష్టం జరిగినట్లు తె లుస్తోంది. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా స్తంభించింది.
కాల్వశ్రీరాంపూర్ : మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం భారీ ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి ధాన్యం తడిసింది. కోతకు వచ్చిన వరి నేలవాలిపోయాయి. భారీ ఈదు రు గాలులు వీయడంతో పలు గ్రామాల్లో చెట్లు రోడ్డుకు అడ్డంగా విరిగి పడ్డాయి. వరి ధాన్యం చేలలో నేలరాలాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతి కందే దశలో నేల వాలడంతో రైతులు బోరున విలపించారు. అలాగే అంకంపల్లి, ఆశన్నపల్లి, పెద్దరాత్‌పల్లి మూడు గ్రామాల్లో మామిడికాయలు నేలరాలాయి.

సుల్తానాబాద్‌రూరల్: గట్టేపల్లిలో రాజమ్మ రేకుల ఇంటిపై వేప చేటు విరిగి పడడంతో 12 రేకులు పగిలిపోయాయి. అలాగే రమేశ్ ఇంటిపై కప్పులేచిపోయి 32 రేకులు ధ్వంసమయ్యాయి. కాట్నపల్లి, రామునిపల్లి, చిన్నకల్వలలో తదితర గ్రామాల్లోని పైకప్పు లేచి రేకులు విరిగి పోయ్యాయి. నీరుకుళ్ల,సుద్దాల, సమీప గ్రామాల్లో మామిడి కాయలు నేలవాలయి. సుద్దాల హిమబింధు, మణిశంకర్,అన్నపూర్ణ రైస్ మిల్లుల రేకులు లేచిపోయాయి. పలు చోట్ల విద్యుత్ స్తం భాలు విరిగి పోయ్యాయి.తొగర్రాయిలో వరి తడిసింది. సుద్దాల గ్రామానికి చెందిన అలాడి భాగమ్మ (50) అనే మహిళ గ్రామ కొనుగొలు కేంద్రం సమీపంలో ఉండగా పక్కన ఉన్న గోడ కూలి మీద పడడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆమెను దవాఖానకు తర లిస్తుండగా, మృతి చెందింది. సుగ్లాంపల్లి శివారులోని ఓ సంచుల ఫ్యాక్టరీలో బీహార్‌కు చెందిన ఇమ్రాన్, మూలసాలకు చెందిన నరేశ్‌కు విద్యుదాఘాతానికి గుర య్యారు. గమనించిన స్థానికులు వెంటనే కరీంనగర్ దవాఖానకు తరలించిన్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ రాజేశ్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగితెలుసుకున్నారు.

సుల్తానాబాద్: కాల్వశ్రీరాంపూర్ రహదారిలో చెట్టు కరెం ట్ స్తంభంపై విరిగిపడడంతో మూడు ఆటోలు ధ్వంసమయ్యాయి. గరిగె మధునయ్య భవనం, మణిమాల టిఫిన్ సెంటర్‌పై ఉన్న హోర్డింగ్‌లు ఈదురుగాలులకు పడిపోయా యి. నీరుకుళ్ల రోడ్డులో కొలిమి పని చేసుకునే బాలాజీకి చెం దిన ఇంటి కప్పు లేచిపోయింది. యాదవనగర్‌లో బోయిని లస్మయ్య గుడిసె కూలిపోవడంతో ఇంట్లోని సామగ్రి ధ్వంసమయ్యాయి. అదే కాలనీకి చెందిన గెల్లు రాజమ్మ ఇంటి పైకప్పు కూలడంతో, ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. శాంతినగర్‌లో దున్నపోతుల సమ్మయ్యకు చెందిన ఇంటి పైకప్పు కూలడంతో ఇంట్లోని సామాను ధ్వంసమయ్యాయి. కరెంట్ వైర్లు తెగిపోవడంతో సుల్తానాబాద్ అంధకారంలో ఉండిపోయింది. నీరుకుళ్ల రోడ్‌కు అడ్డంగా దాదాపు 10 చెట్లు పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పోలీసు, మున్సిపాలిటీ, విద్యుత్ అధికారులు, సిబ్బంది ఏర్పడిన అంతరాయాన్ని తొలగించేందుకు జాగ్రత్త చర్య లు తీసుకున్నారు. సుల్తానాబాద్‌లో విద్యుత్ సరఫరా నిలిచింది.
ఓదెల: మండలంలో దాదాపు గంట సేపు వీచిన బలమైన గాలులు, భారీ వర్షానికి కరెంట్ స్తంభాలు, చెట్లు, పొలాలు నేలవాలాయి. కొలనూర్, ఓదెల, కనగర్తి, పొత్కపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో రైతులకు చేతికి అందివచ్చిన ధాన్యం తడిసింది. కోతకు వచ్చిన పొ లాలు నేలవాలిపోయి ధాన్యం గింజలు పొలాల్లో రాలాయి. ఉప్పరపల్లి లో రాళ్ల వర్షం పడి దాదాపు 50కి పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడగా, 30 రేకుల ఇండ్ల పైకప్పులు లేచిపోయి నష్టం వాటిల్లింది. అలాగే ఓదెల, కొలనూర్, పొత్కపల్లి గ్రామాల్లోని మామిడితోటల్లో మామిడి కాయలు రాలిపోయాయి. కొలనూర్‌లో రోడ్ల వెంబడి మురికి కాలువల్లో నీరు నిలిచిపోవడంతో సర్పంచ్ భర్త ఢిల్లీ శంకర్ శుభ్రం చేశాడు. కరెంట్‌ను పునరుద్ధరించేందుకు రాత్రివేళ సైతం ట్రాన్స్‌కో ఏఈ రవీందర్, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. వర్షం కారణంగా కరెంట్ నిలిచిపోయి గ్రామాల్లో అంధకారం నెలకొంది.

కలెక్టరేట్: గాలి దుమారానికి ఎక్కడికక్కడ భారీ వృక్షాలు కుప్పకూలిపోగా, పెంకుటిల్లు, పూరి గుడిసెలు, రేకుల ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. పొలాలు నేలవాలిపోయాయి. వరి, మొక్కజొన్న పంటలు నేలవాలిపోగా, కోత కోసేందుకు కాచిన మామిడి కాయలు విపరీతమైన గాలి దుమారానికి నేలరాలిపోయాయి. గాలి దుమారం బీభత్సానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కలెక్టర్ శ్రీదేవసేన ఆదేశాల మేరకు పెద్దపల్లి ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డి, రెవెన్యూ, వ్యవసాయాధికారులతో కలిసి పలు గ్రామాలను పరిశీలించారు. పెద్దపల్లిలో సుమారు రెండువేల ఎకరాల మేరకు వరి, మక్క, మామిడి పంటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. పెద్దపల్లి మండలం భోజన్నపేట, మారేడుగొండ, రాంపల్లి, మూలసాల, చీకురాయి, కొత్తపల్లి, హన్మంతునిపేట గ్రామా ల్లో భారీ ఎత్తున ఇండ్లు కూలిపోగా, పంటలకు నష్టం వాటిల్లింది. సబ్బితం బస్టాండ్ పైకప్పు గాలి దుమారానికి లేచిపోయింది. ఆర్డీఓ, పెద్దపల్లి తహసీల్దార్ శ్రీనివాస్‌తో కలిసి భోజన్నపేట గ్రామాన్ని పరిశీలించి, లేచిపోయిన ఇంటి పైకప్పులను నష్టపోయిన పొలాలను చూశారు. అప్పన్నపేట, నిమ్మనపల్లి, నిట్టూరు, ముత్తారం, దేవునిపల్లి, గౌరెడ్డిపేట, తుర్కలమద్ధికుంట తదితర గ్రామాల్లో మామిడితోటల్లో కాయలు నేలరాలిపోయాయి.

ఇండ్లు కూడా పాక్షికంగా ధ్వంసమై ఇంటి కప్పులు లేచిపోయాయి. గుర్రాంపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌తో విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో కరెంట్ సరఫరా నిలిచింది. పెద్దపల్లిలోని శాంతినగర్‌తో పాటు పలు వార్డుల్లో భారీ వృక్షాలు విరిగిపడడంతో విద్యుత్ స్తంభాలు విరిగి, తీగలు తెగిపడడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 10 గంటల వరకు పెద్దపల్లి అంధకారంలో ఉంది. మూలసాల గ్రామానికి చెందిన కాసు అజయ్, కాసు నరేశ్ అనే గొర్రెల కాపరులు కొత్తపల్లి శివారులో తమ గొర్రెలను మేపుతుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో కాసు అజయ్ (24) అక్కడికక్కడే మృతి చెందగా, కాసు నరేశ్ తీవ్ర గాయాలపాలు కావడంతో పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో ప్రథమ చికిత్స చే యించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. గొర్రెల కాపరులిద్దరు పిడుగుపాటుకు గురైన స్థలాన్ని ఆర్డీఓ, తహసీల్దార్, ఎస్‌ఐ ఉపేందర్‌రావు పరిశీలించి, వివరాలను నమోదు చేసుకున్నారు. గాలి దుమార బీభత్సానికి జరిగిన నష్టంపై పూర్తి స్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఆర్డీఓ తెలిపారు.

ఎలిగేడు (జూలపల్లి): ఎలిగేడు మండలంలో గాలిదుమారంతో పలు ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. ఇనుప రేకులు గాలి దుమారానికి నేలమీద పడ్డాయి. పలు చోట్ల విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు విరిగి నేలవాలాయి. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

145
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...